ఆ పార్టీదే ఏపీలో అధికారం...ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌నం

ఆ పార్టీదే ఏపీలో అధికారం...ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌నం

మాజీ ఎంపీ ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మ‌రోమారు మీడియా ముందుకు వ‌చ్చారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ప్ర‌స్తుత సార్వ‌త్రిక ఎన్నిక‌ల జోస్యం చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు రాజధాని మరియు నూతనంగా నిర్మించుకుటున్న ప్రాజెక్ట్ పూర్తికావడానికి అవకాశం ఉంటుందని, ఈ దిశ‌గానే ఫ‌లితాలు ఉంటాయ‌ని ల‌గ‌డ‌పాటి తెలిపారు.  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై ఆదివారం సాయంత్రం 6గంటలకు తిరుపతిలో స్ప‌ష్టంగా చెబుతానని అన్నారు.

తాను నెలరోజులుగా అమెరికాలో ఉన్నానని ఈ సంద‌ర్భంగా ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ‌ను క‌న‌బ‌ర్చార‌ని ల‌గ‌డ‌పాటి పేర్కొన్నారు. ``పాండవులు ఖాండవవనాన్ని ఇంద్రప్రస్థముగా మలిచారు. రాజధాని ప్రాంత రైతులు ఇది ఇంద్రప్రస్థం అవుతుందా లేక ఎడారిగా మారే ఆలోచనలో ఉన్నారు. సంక్షేమం మరియు అభివృద్ధి సమానముగా జరుగుతున్నాయి. అందరూ ఆనందించే విధంగా రాజధాని మరియు మయసభ లాగా ఉంటుంది. ప్రత్యేక హోదా లేకపోయినా అనంతపూర్ లో కియా మరియు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల పరిశ్రమలు వచ్చాయి.40 వేల ఎకరాలలో ఇంత పెద్ద రాజధాని నిర్మాణం ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.`` అని తెలిపారు.

రాష్ట్రంలో అనుకూలమైన కేంద్ర ప్రభుత్వం వస్తే అభివృద్ధి వేగవంతం అవుతుందని ల‌గ‌డ‌పాటి జోస్యం చెప్పారు. ``రేపటి తుదివిడత ఎన్నికల తర్వాత ఎక్సిట్ పోల్స్ ద్వారా తెలిసే అవకాశం ఉంది. 23 వ తారీఖున పూర్తిగా మనకు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తెలిసిపోతుంది. తెలంగాణాలో నేను చెప్పిన ఫలితాలు కొంతవరకు తప్పాయి. రాజధాని రైతులకు రహస్యంగా ఎవరు అధికారంలోకి వస్తారో చెవిలో చెప్పి వచ్చాను. రేపు ఎన్నికలు ముగిశాక తిరుపతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో ఎవరు గెలుస్తారో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్తాను. అభివృద్ధిలో పాలక పక్షం మరియు ప్రతిపక్షాలు కలసి వెళ్తే బావుంటుంది.`` అని ల‌గ‌డ‌పాటి పేర్కొన్నారు.

తెలంగాణ మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు కారెక్కారని, ఏపీలో లోటు బడ్జెట్ ఉంది కాబట్టి ప్రజలకు సైకిలే దిక్కయిందని ల‌గ‌డ‌పాటి చ‌మ‌త్కారంగా రాబోయే ఫ‌లితాల‌ను విశ్లేషించారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ లైఫ్ గురించి పేర్కొంటూ,మెగాస్టార్‌ చిరంజీవి సోద‌రుడు అయిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రాజ‌కీయంలోనే ఆయ‌న‌ కంటే కొద్దిగా తక్కువగానే ఉంటారని ల‌గ‌డ‌పాటి పేర్కొన్నారు.  ప‌వ‌న్ అసెంబ్లీలో అడుగు పెడతార‌ని వెల్ల‌డించారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English