ఆ ‘అర్జున్ రెడ్డి’ ఈసారి ఎలా తయారయ్యాడో..

ఆ ‘అర్జున్ రెడ్డి’ ఈసారి ఎలా తయారయ్యాడో..

తెలుగులో రెండేళ్ల కిందట సెన్సేషనల్ హిట్టయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి కొన్ని నెలల్లోనే సన్నాహాలు మొదలయ్యాయి. సీనియర్ దర్శకుడు బాలా దర్శకత్వంలో విక్రమ్ తనయుడు ధ్రువ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను మొదలుపెట్టింది. చకచకా షూటింగ్ కూడా కానిచ్చారు. కానీ దీని టీజర్, ట్రైలర్ విషయంలో విపరీతమైన నెగెటివిటీ రావడంతో మొత్తం సినిమాను చెత్త బుట్టలో వేసేయడం సంచలనం రేపింది.

బాలా లాంటి దర్శకుడికి ఇది పెద్ద అవమానమే. కానీ ఆయన దీని గురించి పెద్దగా మాట్లాడుకుండా ధ్రువ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సెలైంటుగా ఉండిపోయాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు  దర్శకుడు సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంటుగా పని చేసిన గిరీశయ్యకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించి మళ్లీ కొత్తగా సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

‘ఆదిత్య పేరు’తో మళ్లీ మొదలైన ఈ చిత్రం చకచకా షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం. కేవలం నెలన్నరలో ఈ సినిమాను ముగించేశాడుు గిరీశయ్య. బాలా తీసిన వెర్షన్లో ఆయన క్రియేటివిటీ జోడించడమే సమస్య అయినట్లుంది. దీంతో గిరీశయ్య మార్పులేమీ చేయకుండా ఒరిజనల్‌ను మక్కీకి మక్కీ తీసినట్లున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ కూడా ఒరిజినల్‌గా డిట్టోలా అనిపిస్తోంది. మొత్తానికి తమిళ వెర్షన్ షూటింగ్ అయితే పూర్తి చేసుకుంది. మళ్లీ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించినపుడే ఈ చిత్రాన్ని జూన్లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. త్వరలోనే టీజర్ లాంచ్ చేయబోతున్నారు.

అది చూశాక కానీ సినిమాపై ఒక అంచనాకు రాలేం. ఈసారి జనాలు ఎలా స్పందిస్తారో అని చిత్ర బృందం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మరి ‘అర్జున్ రెడ్డి’ ఈసారి ఎలా తయారయ్యాడో టీజర్ చూశాక ఒక అంచనాకు వద్దాం. ‘కబీర్ సింగ్’ సైతం జూన్‌లోనే రిలీజ్ కానుండగా.. ‘ఆదిత్య వర్మ’ సైతం అదే నెలలో వస్తుండటంతో దేనికి ఎలాంటి ఫలితం వస్తుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English