సల్మాన్ .. కత్రినా... ప్రియాంక ...

సల్మాన్ .. కత్రినా... ప్రియాంక ...

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘భారత్’. సల్మాన్‌కు ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన అబ్బాస్ అలీ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సల్మాన్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కింది. ఓ భారీ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సల్మాన్ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా విషయంలో చాలా ఆశలతో ఉన్నాడు. ఇప్పటిదాకా సల్మాన్‌తో జత కట్టని ప్రియాంక చోప్రాను ఈ సినిమాకు కథానాయికగా అనుకున్నారు. ఆమె కూడా ఓకే చెప్పింది. కానీ మరికొన్ని రోజుల్లో షూటింగ్‌కు రావాల్సి ఉన్న సమయంలో ప్రియాంక ‘భారత్‌’ నుంచి తప్పుకోవడం వివాదాస్పదమైంది. ఆమె విషయంలో సల్మాన్ చాలా ఆగ్రహానికి గురైనట్లు వార్తలొచ్చాయి. ప్రియాంక మీద బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు సల్మాన్ గతంలో.

ఐతే ప్రియాంక స్థానంలో కత్రినా కైఫ్‌ను తీసుకుని సినిమా షూటింగ్ కూడా ముగించి రిలీజ్‌కు రెడీ చేసిన సమయంలో కూడా ప్రియాంక మీద సల్మాన్ ఆగ్రహం తగ్గినట్లు లేదు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా మరోసారి కత్రినా మీద సెటైర్ వేశాడు సల్మాన్. ‘భారత్‌’లోని ‘జిందా..’ అనే పాటను రిలీజ్ చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన కత్రినా ఈ సినిమా తనకు గొప్ప అనుభూతిని ఇచ్చినట్లు పేర్కొంది.

ఆమె ఇంకా ఏదో మాట్లాడుతుండగా.. మధ్యలో కల్పించుకున్న సల్మాన్.. ‘థ్యాంక్స్ టు ప్రియాంక’ అన్నాడు. వెంటనే అందరూ గొల్లుమన్నారు. ప్రియాంక లేకపోవడం వల్ల ఈ సినిమాకు మంచే జరిగిందని సల్మాన్ గతంలో అన్నాడు. అదే విషయాన్ని తాజా వ్యాఖ్యతో మరోసారి రూఢి చేసినట్లయింది. అనంతరం కత్రినా నటన గురించి సల్మాన్ మాట్లాడుతూ.. ‘ఆమె చాలా కష్టపడింది. అద్భుతంగా నటించింది. ఈ ఏడాది ఆమె ఉత్తమ నటిగా కచ్చితంగా జాతీయ అవార్డు గెలుచుకుంటుంది’ అని పేర్కొనడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English