రెంటికి చెడిన ‘హిప్పి’ సినిమా

రెంటికి చెడిన ‘హిప్పి’ సినిమా

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఓవర్ నైట్ సూపర్ పాపులారిటీ సంపాదించాడు కార్తికేయ. ఈ సినిమా తర్వాత అతడికి పెద్ద ఎత్తునే అవకాశాలు వచ్చాయి. ఐతే అతను అందులోంచి ఓ వెరైటీ ప్రాజెక్టును ఎంచుకున్నాడు. తమిళ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మాణంలో ‘నువ్వు నేను ప్రేమ’ ఫేమ్ టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.

ఈ చిత్రమే.. హిప్పి. కార్తికేయకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇక్కడ బాగానే మార్కెట్ అవుతుందనుకున్నారు. మరోవైపు ‘హిప్పి’ దర్శకుడు, నిర్మాత తమిళం వాళ్లు కావడంతో అక్కడ కూడా సినిమాను రిలీజ్ చేసుకోవచ్చని భావించారు. రెండు భాషల్లో కలిపి బాగా బిజినెస్ జరుగుతుందని ఆశించారు. కానీ ఇప్పుడీ చిత్రానికి రెండు చోట్లా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.

తెలుగు ప్రేక్షకులు ‘హిప్పి’ని తమిళ సినిమాలా భావిస్తున్నారు. దీన్ని తీసింది తమిళ దర్శకుడు, నిర్మాత కావడంతో తెలుగు చిత్రం లాగా అనిపించడం లేదు. ప్రోమోల్లో అరవ టచ్ కనిపించింది. తమిళంలో తీసి తెలుగులోకి డబ్ చేస్తున్న ఫీలింగ్‌లో ఉన్నారు మన జనాలు. మరోవైపు తమిళ జనాలేమో హీరో తమకు పరిచయం లేకపోవడంతో ఇది తమ సినిమాగా భావించడం లేదు. ఇలా రెండు చోట్లా ఈ చిత్రాన్ని ఓన్ చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదు. తెలుగులో, తమిళంలో రెండు చోట్లా దీనికి బిజినెస్ జరగలేదు.

అసలు తమిళంలో ఈ చిత్రాన్ని ఒకేసారి రిలీజ్ చేస్తారా లేదా అన్నది కూడా స్పష్టత లేదు. తెలుగు ప్రేక్షకులు దీన్ని అంతగా ఓన్ చేసుకోకపోవడం చూసి.. దర్శకుడు కృష్ణ స్పందించాల్సి వచ్చింది. ఇది అచ్చ తెలుగు సినిమా అని.. మరోలా చూడొద్దని ట్విట్టర్ ద్వారా అప్పీల్ కూడా ఇచ్చాడు. అయినా మన జనాలు దీన్ని పట్టించుకున్నట్లు లేదు. జూన్ 7న రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇప్పటిదాకా బజ్ లేదు. సరిగా బిజినెస్సూ జరగలేదు. మరి ఈ సినిమాను ఎలా జనాల్లోకి తీసుకెళ్తారో?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English