‘కాంఛన’ పాత్రలో అక్షయ్‌ని చూశారా?

‘కాంఛన’ పాత్రలో అక్షయ్‌ని చూశారా?

దక్షిణాదిన హార్రర్ కామెడీ జానర్‌కు మాంచి ఊపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘కాంఛన’ ఒకటి. ‘ముని’కి కొనసాగింపుగా రాఘవ లారెన్స్ రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో తమిళ, తెలుగు భాషల్లో సెన్సేషనల్ హిట్టయింది. ఈ చిత్రంలో లారెన్సే హీరోగా కూడా నటించాడు. ఈ చిత్రం కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయి అక్కడా విజయం సాధించింది. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత హిందీలో ‘కాంఛన’ రీమేక్ అవుతుండటం విశేషం. లారెన్సే డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు.

ఇటీవలే సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. ఇంతలోనే అక్షయ్ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఈ సినిమాలో దయ్యంగా మారిన హిజ్రా తనను ఆవహించడంతో హీరో అమ్మాయి తరహాలో ప్రవర్తిస్తాడన్న సంగతి తెలిసిందే. ‘కాంఛన’లో చాలా ప్రత్యేకంగా అనిపించే సన్నివేశాలవి. మాతృకలో లారెన్స్ యాక్ట్స్ భలే ఆసక్తికరంగా అనిపించాయి.

‘కాంఛన’ రీమేక్‌లో ముందుగా ఆ సన్నివేశాల్నే తెరకెక్కించిన లారెన్స్.. అక్షయ్ అద్దం ముందు నిలబడి అమ్మాయిలా మేకప్ వేసుకుంటున్న దృశ్యం నుంచే ఫస్ట్ లుక్ రెడీ చేయించాడు. ఈ చిత్రానికి ‘లక్ష్మీబాంబ్’ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్లో టైటిల్‌తో పాటుగా రిలీజ్ డేట్ కూడా వేసేశారు. 2020 జూన్ 5న ‘లక్ష్మీబాంబ్’ ప్రేక్షకుల ముందుకు వస్తుందట.

అక్షయ్ సీరియస్ పాత్రల్ని ఎంత బాగా చేస్తాడో.. కామెడీ క్యారెక్టర్లలో కూడా అలాగే అదరగొడతాడు. ‘కాంఛన’ రీమేక్‌కు అతను పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ అక్షయ్‌కి జోడీగా నటిస్తోంది. మరి ఒరిజినల్లో శరత్ కుమార్ చేసిన హిజ్రా పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో, సాంకేతికంగా మరింత ఉన్నతంగా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. దాదాపుగా ఒరిజినల్‌నే ఫాలో అయిపోతున్నాడట లారెన్స్.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English