‘రైతు’ తీయడానికి కృష్ణవంశీ రెడీ అట

 ‘రైతు’ తీయడానికి కృష్ణవంశీ రెడీ అట

ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలతో తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడిగా గుర్తింపు సంపాదించాడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఐతే చాలామంది దిగ్గజ దర్శకుల్లాగే అతను కూడా కాల పరీక్షకు నిలవలేకపోయాడు. ఒక దశ దాటాక ఔట్ డేట్ అయిపోయాడు. వరుసబెట్టి ఒకే రకమైన సినిమాలతో విసుగెత్తించాడు. చివరగా ఆయన తీసిన ‘నక్షత్రం’ ఎంత దారుణమైన ఫలితాన్నందుకుందో తెలిసిందే. ఆ తర్వాత ఆయన్నుంచి సినిమా రాలేదు.

‘నక్షత్రం’ సెట్స్ మీద ఉన్న సమయంలో బాలయ్యతో ‘రైతు’ అనే సినిమాను కృష్ణవంశీ తీయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. బాలయ్య సైతం ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. వీళ్లిద్దరూ కలిసి ఓ పాత్ర కోసం అమితాబ్ బచ్చన్‌ను కూడా సంప్రదించడం తెలిసిన సంగతే. కానీ ఆ పాత్రకు అమితాబ్ ఓకే అనకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది.

తర్వాత ‘రైతు’ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. కృష్ణవంశీ కూడా దీని గురించి ఏమీ మాట్లాడలేదు. ఐతే తాజాగా ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా ఈ సినిమా ప్రస్తావన వచ్చింది. ‘రైతు’ సినిమాను ఎందుకు ఆపేశారు.. ఆ సినిమా తీయొచ్చు కదా అని ఓ నెటిజన్ అడిగితే.. ‘రైతు’ తీయడానికి తాను సిద్ధమని ప్రకటించాడు కృష్ణవంశీ. ఐతే సినిమాను పట్టాలెక్కించాల్సింది బాలయ్య అని.. ఆయన సరే అంటే సినిమా తీస్తానని కృష్ణవంశీ చెప్పాడు.

ఇక తన కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోయిన ‘సింధూరం’కు సీక్వెల్ తీయమని ఓ అభిమాని అడిగితే.. ఆ సినిమాకు సీక్వెల్ కానీ, దానికి ఎక్స్‌టెన్షన్ కానీ ఉండదని.. అలాంటి సినిమాల్ని టచ్ చేయకుంటేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డాడు. ‘రాఖీ’ సినిమా అప్పుడు ఫ్లాప్ అయిందని, ఈ రోజుల్లో వస్తే సూపర్ హిట్ అయ్యేదని ఒక నెటిజన్ పేర్కొనగా.. ‘రాఖీ’ ఫ్లాప్ కాదని, ఎబోవ్ యావరేజ్ అని.. ఆ సినిమా ఫలితం తనకు సంతృప్తినే కలిగించిందని చెప్పాడు కృష్ణవంశీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English