తల్లితో గొడవ.. సమంత స్పందించింది

తల్లితో గొడవ.. సమంత స్పందించింది

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దశాబ్దం కిందట్నుంచి తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఐతే ఆమెను ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఎవ్వరూ తల్లిదండ్రులతో చూసింది లేదు. సామ్ పెళ్లయినప్పుడు చాలా ఫొటోలు బయటికి వచ్చాయి కానీ.. తల్లిదండ్రులతో కలిసున్న ఫొటోలు మాత్రం వెలుగు చూడలేదు. కొన్నేళ్ల కిందట సమంతకు సంబంధించి ఒక వివాదం నడుస్తుండగా.. వివరణ కోసం మీడియా ప్రతినిధులు చెన్నైలోని సమంత ఇంటికి వెళ్తే.. ఆమె తల్లిదండ్రులు చాలా సీరియస్ అయ్యారు. ఆమె ఇక్కడ లేదు పొండి అంటూ తిట్టిపోశారు.

ఇక ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో భాగంగా సమంతను పిల్లల గురించి అడిగితే.. తన బాల్యం అంత సజావుగా సాగలేదన్నట్లుగా మాట్లాడింది. తాను తల్లిని అయితే.. తాను బాల్యంలో కోల్పోయిందంతా తన బిడ్డకు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.

దీంతో ఆమెకు బాల్యంలో చేదు అనుభవాలున్నాయేమో.. తల్లిదండ్రులతో విభేదాలున్నాయేమో అన్న సందేహాలు కలిగాయి. ఈ మధ్య ఈ ప్రచారం మరింత ఊపందుకుంటుండటంతో సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు ద్వారా తనకు తల్లిదండ్రులతో ఏ సమస్యా లేదని క్లారిఫై చేసే ప్రయత్నం చేసింది. తన తల్లికి తనకు మధ్య విబేధాలున్నాయనడంలో ఎటువంటి నిజం లేదని.. తాను అందరికంటే ఎక్కువగా తన తల్లిని నమ్ముతానని సమంత స్పష్టం చేసింది.

తన తల్లి చేసే ప్రార్ధనలో ఎదో మాయ ఉంటుందని.. చిన్నప్పట్నుంచి తనకోసం ఆమె ప్రార్థిస్తూనే ఉందని.. ఇప్పుడు కూడా అలాగే చేయమని అడుగుతుంటానని సామ్ చెప్పింది. ఆమె ప్రార్థన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని.. తన తల్లి కేవలం తన కోసం తాను ఎప్పుడూ ప్రార్థన చేసుకోదని.. అదే ఆమెలో ఉన్న ప్రత్యేకత అదే అని.. తనకు రెండో దైవం తల్లే అని చెబుతూ ఆమె ఫొటోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి రూమర్లకు చెక్ పెట్టింది సామ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English