వామ్మో.. ఒక్క సెట్ కోసం 30 కోట్లా?

వామ్మో.. ఒక్క సెట్ కోసం 30 కోట్లా?

ప్రభాస్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో సూపర్ స్టార్. ‘బాహుబలి’తో అతడి ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. మార్కెట్ అనూహ్యమైన స్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉండటంతో అతడి సినిమాల స్థాయే మారిపోయింది. ‘బాహుబలి’ రావడానికి ముందు ఓ యాభై కోట్లలో తీయాలనుకున్న ‘సాహో’ సినిమా బడ్జెట్ ఇప్పుడు రూ.200 కోట్లు దాటిపోవడాన్ని బట్టి ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు రూ.100 కోట్లు పెట్టినట్లుగా వార్తలొచ్చాయి. ఐతే ఇది యాక్షన్ మూవీ కాబట్టి అంత ఖర్చు పెట్టడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ దీని తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రేమకథా చిత్రానికి కూడా రూ.150 కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారట. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్‌తో కలిసి ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుకు చెందిన గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తోంది.

ఈ సినిమా కోసం ఏకంగా రూ.30 కోట్లు పెట్టి ఒక భారీ సెట్ వేస్తున్నారట. ఇండియాలో ఒక సెట్టింగ్ కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం ఇదే తొలిసారి అంటున్నారు. ఈ చిత్రం యూరప్ నేపథ్యంలో సాగుతుందని ఇంతకుముందే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. రోమ్ సహా పలు నగరాల్లో ఇప్పటికే కొంత షూటింగ్ చేశారు. ఐతే అక్కడే పూర్తి స్థాయిలో చిత్రీకరణ సాధ్యం కాదని.. హైదరాబాద్ శివార్లలో యూరప్ నగరాల్ని తలపించే సెట్టింగ్స్ వేస్తున్నారు. వాటి కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చవుతున్నట్లు సమాచారం. బడ్జెట్ విషయంలో భయం లేదు కాబట్టి క్వాలిటీ పరంగా ఏమాత్రం రాజీ పడకుండా చూసుకుంటోంది చిత్ర బృందం. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. దీనికి ‘జాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English