ఇంతకీ ఫైనల్‌గా ‘జెర్సీ’ని ఏమని పిలవాలి?

ఇంతకీ ఫైనల్‌గా ‘జెర్సీ’ని ఏమని పిలవాలి?

నేచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన కొత్త సినిమా ‘జెర్సీ’కి ఎంత గొప్ప టాక్ వచ్చిందో తెలిసిందే. తెలుగులో వచ్చిన బెస్ట్ స్పో్ర్ట్స్ డ్రామా ఇదే అనడంలో మరో మాట లేదు. కాకపోతే ఈ చిత్రానికి వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. సినిమా టాక్‌తో పోలిస్తే కలెక్షన్లు తక్కువగానే ఉన్నాయి. డివైడ్ టాక్ తెచ్చుకున్న నాని చిత్రం ‘ఎంసీఏ’తో పోలిస్తే దీని వసూళ్లు చాలా తక్కువగా కనిపించాయి. ఎ సెంటర్ల వరకు బాగానే ఆడినా.. బి, సి సెంటర్లలో దీనికి ‘కాంఛన’ అడ్డం పడింది. అక్కడ నామమాత్రపు వసూళ్లు వచ్చాయి. దీంతో ఒక దశలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు వెళ్తుందా లేదా అన్న సందేహాలు కలిగాయి. కానీ ‘జెర్సీ’ నెమ్మదిగానే అడుగులేసినప్పటికీ చాలా దూరమే ప్రయాణించింది. దీనికి బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లభించింది. తర్వాతి రెండు వారాల్లో ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ మినహాయిస్తే తెలుగు సినిమాలేవీ రిలీజ్ కాకపోవడం కలిసొచ్చింది.


ఒక దశ దాటాక ‘జెర్సీ’ గురించి డిస్కషన్లు ఆగిపోయాయి కానీ.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే పెర్ఫామ్ చేసింది. ‘మహర్షి’ రాకతో ‘జెర్సీ’ థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తయింది. కొన్ని చోట్ల మాత్రమే ఆడుతోంది. ఇప్పుడు లెక్కలు తీస్తే ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.35 కోట్ల షేర్ సాధించడం విశేషం. అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం బయ్యర్లకు లాభాలు పంచింది. దీని థియేట్రికల్ హక్కుల్ని రూ.27 కోట్లకు అమ్మారు. ఆ మార్కును దాటి ఇంకో ఎనిమిది కోట్లు లాభం తేవడం అంటే విశేషమే. ఆరంభంలో స్లో రన్ చూసి అసలు ‘జెర్సీ’ బ్రేక్ ఈవెన్‌ అయినా సాధిస్తుందా అన్న సందేహాలు కూడా కలిగాయి. ఇలాంటి మంచి సినిమాలకు ఆర్థికంగా అంత ప్రయోజనం దక్కకపోతే మళ్లీ ఇలాంటి ప్రయత్నాలు జరగడం ఆగిపోతుంది. ‘జెర్సీ’ ఇప్పుడు సూపర్ హిట్ రేంజికి వెళ్లిన నేపథ్యంలో మున్ముందు ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని  చూడొచ్చన్నమాటే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English