కాలర్ ఎగరేయడంపై మహేష్ వివరణ

కాలర్ ఎగరేయడంపై మహేష్ వివరణ

ఒక స్టార్ హీరో తన సినిమా విజయానికి పొంగిపోతూ అభిమానుల ముందు కాలర్ ఎగరేయడం ఇంతకుముందెన్నడూ జరగలేదేమో. ‘మహర్షి’ సినిమా ఫలితం విషయంలో మహదానందంతో ఉన్న మహేష్ బాబు ఒకటికి రెండుసార్లు ఈ పని చేశాడు. కొన్ని రోజుల కిందట ిసక్సెస్ మీట్లో ఒకసారి కాలర్ ఎగరేస్తేనే అంతా ఆశ్చర్యపోయారు. ఈ విషయంలో మిశ్రమ స్పందన కూడా వ్యక్తమైంది. ఈ పనిని తప్పుబట్టిన వాళ్లూ లేకపోలేదు. అలాంటిది మహేష్ హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ సందర్శనకు వెళ్లి అక్కడ మరోసారి అభిమానుల ముందు కాలర్ ఎగరేశాడు. దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. తాజాగా ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూకు వెళ్లిన మహేష్‌కు ఇదే విషయమై ప్రశ్న ఎదురైంది.
దీనికి మహేష్ టపీటపీమని బదులిచ్చేశాడు. కాలర్ ఎగరేయడంలో వేరే ఉద్దేశం ఏమీ లేదన్నాడు. ఏదో ఇలా చేయాలంటే చేయాలి అని ముందే అనుకుని వెళ్లి అలా చేయలేదని మహేష్ చెప్పాడు.

నిజంగా ‘మహర్షి’ లాంటి సినిమా చేయడం, అది ఇంత పెద్ద విజయం సాధించడం తనకు చాలా గర్వంగా అనిపించిందని.. ఆ సందర్భంలో వంశీ మాటల్ని గుర్తు చేస్తూ కాలర్ ఎగరేయాలనిపించిందని.. చేసేశానని మహేష్ చెప్పాడు. సుదర్శన్ థియేటర్‌కు వెళ్లినపుడు చాలా మాట్లాడాలని అనిపించిందని.. కానీ ఎమోషన్లో ఏం మాట్లాడలేక మరోసారి కాలర్ ఎగరేశానని అన్నాడు మహేష్. ‘మహర్షి’ సినిమా మొదలైనప్పటి నుంచి తాను చాలా మంచి సినిమాలో నటిస్తున్నానని.. ఇది పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉందని మహేష్ చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ మొదలైన తొలి రోజే దర్శకుడు వంశీ పైడిపల్లితో పాటు తన మిత్రులందరికీ ‘మహర్షి.. పోకిరి స్క్వేర్’ అని మెసేజ్ పెట్టినట్లు ఈ ఇంటర్వ్యూలో మహేష్ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English