ర‌విప్ర‌కాశ్ విజ‌య‌వాడలో ఉన్నారా..పోలీసుల‌కు దొరికిన క్లూ ఇదేనా

ర‌విప్ర‌కాశ్ విజ‌య‌వాడలో ఉన్నారా..పోలీసుల‌కు దొరికిన క్లూ ఇదేనా

ఫోర్జ‌రీ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఉదంతం మ‌లుపులు తిరుగుతోంది. త‌మ ఎదుట హాజరుకావాలంటూ గ‌త బుధవారం ఉదయం 11 గంటల వరకు సమయం ఇస్తూ సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు నోటీసులు జారీచేసినా...రవిప్రకాశ్ విచారణకు డుమ్మాకొట్టారు. ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినా ఆయన నుంచి స్పందన లేకపోవడంతో తదుపరి చర్యలపై సైబరాబాద్ పోలీసులు దృష్టిపెట్టారు. ఇదే స‌మ‌యంలో ర‌విప్ర‌కాశ్‌కు బెయిల్ దొర‌క‌లేదు. పైగా ఆయ‌న స‌మ‌యం కోరుతున్న త‌రుణ‌లో ... ఆయ‌న చిరునామాను పోలీసులు ప‌సిగ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ర‌విప్ర‌కాశ్ ఓ ఈ మెయిల్‌ సమాచారం పంపారు. ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, వ్యక్తిగత కారణాల వద్ద ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని, విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో 10 రోజుల గడువు కావాలని ఆయన కోరారు. ర‌విప్రకాశ్ బాటలోనే పయనించిన నటుడు శివాజీ, తనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, తనకు కూడా 10 రోజుల గడువు కావాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన ఓ మెయిల్ ను పంపారు. రవిప్రకాశ్, శివాజీలు పంపిన ఈ-మెయిల్స్ పై సంతృప్తి చెందని పోలీసులు, ఐపీ అడ్రస్ ల ఆధారంగా వీరిద్దరూ విజయవాడలో ఉంటున్నట్టు గుర్తించారని స‌మాచారం.

కాగా,  రవిప్రకాశ్‌కు సంబంధించిన ఫోర్జరీ కేసు దర్యాప్తు కొనసాగుతున్నది, న్యాయ సలహాల మేరకు దర్యాప్తులో ముందుకెళ్తామని సైబరాబాద్ పోలీసులు పేర్కొంటున్నారు.  ప్రత్యేక బృందాలు రంగంలోకి దించి ర‌విప్ర‌కాశ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన స‌మ‌స్య కావ‌డంతో సున్నితంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English