మోహన్ బాబు సరసన ఐశ్వర్యారాయ్!

మోహన్ బాబు సరసన ఐశ్వర్యారాయ్!

మోహన్ బాబేంటి.. ఆయన పక్కన మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ నటించడమేంటి? ఈ జోడీని ఊహించుకోవడానికి కూడా ఏదోలా అనిపిస్తోంది కదా? కానీ ఇది నిజం అంటున్నాయి కోలీవుడ్ మీడియా వర్గాలు. ఎవరి పక్కన ఎవరినైనా పెట్టి మెప్పించగల లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం.. మోహన్ బాబు, ఐశ్వర్యారాయ్‌లతో జోడీ కట్టిస్తున్నట్లు సమాచారం. ఎన్నో ఏళ్లుగా పక్కన పడి ఉన్న ఆయన కలల ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్’ ఇప్పుడు పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మోహన్ బాబు నటిస్తారని ఈ మధ్యే వెల్లడైంది. అలాగే ఐశ్వర్యారాయ్ పేరు కూడా వినిపించింది. ఐతే వీళ్లిద్దరూ జంటగా నటిస్తారని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో మోహన్ బాబుకు భార్యగా ఐశ్వర్య కనిపిస్తుందట. రాజ్యాధికారం కోసం ఎంతకైనా తెగించే నెగెటివ్ క్యారెక్టర్లో ఐశ్వర్య కనిపించనున్నట్లు సమాచారం.

మణిరత్నం ఏం చేసినా ఒక కన్విక్షన్‌తో చేస్తారు. ఎంతో ఆలోచించి కానీ.. మోహన్ బాబుకు జోడీగా ఐశ్వర్యను పెట్టి ఉండరు. కాబట్టి సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. ‘పొన్నియన్ సెల్వన్’ అనే చారిత్రక నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఐశ్వర్య మామ అమితాబ్‌ బచ్చన్‌ బచ్చన్ కూడా నటించనున్నట్లు సమాచారం. ఇంకా విక్రమ్‌, విజయ్‌ సేతుపతి, జయం రవి, అనుష్క శెట్టి, కీర్తి సురేశ్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషించనున్నారట. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు సమకూర్చబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. మణిరత్నం కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో.. అతి పెద్ద తారాగణంతో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English