మహేష్‌ను మహేషే అవమానించుకుంటున్నాడే..

మహేష్‌ను మహేషే అవమానించుకుంటున్నాడే..

కొన్ని రోజుల కిందట ‘మహర్షి’ సక్సెస్ మీట్లో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన సినిమాల వసూళ్లను ‘మహర్షి’ వారం రోజుల్లోనే దాటేయబోతోందన్నాడు. దిల్ రాజు కూడా ఈ మాటకు వంత పాడాడు. ఆ రోజు ఏదో ఉత్సాహంలో, తొందరపాటులో వీళ్లిద్దరూ అలా మాట్లాడారేమో అనుకున్నారు. కానీ ‘మహర్షి’ థియేట్రికల్ రన్ వారం పూర్తి కాగానే ఒక పోస్టర్ పడింది. ఆ రోజు మహేష్, రాజు ఏం అన్నారో.. అదే విషయం ఈ పోస్టర్‌పై కనిపించింది. వారం రోజులకే మహేష్ కెరీర్లో ఓవరాల్ హైయెస్ట్ గ్రాసర్‌గా ‘మహర్షి’ నిలిచిందని ఘనంగా ప్రకటించుకున్నారు. ఇది ఇప్పుడు మహేష్ అభిమానులకే షాకింగ్‌గా ఉంది.

మహేష్ ఇంతకుముందు ‘శ్రీమంతుడు’ సినిమాతో నాన్-బాహుబలి రికార్డును బద్దలు కొట్టాడు. ఆ చిత్రం రూ.85 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇక గత ఏడాది మహేష్ నుంచి వచ్చిన ‘భరత్ అనే నేను’ రూ.92 కోట్ల షేర్ సాధించి మహేష్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఐతే ఇప్పుడు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘మహర్షి’ తొలి వారంలో రూ.75 కోట్ల షేర్ సాధించిందట. అలాంటపుడు ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ ఫుల్ రన్ వసూళ్లను ‘మహర్షి’ ఎలా దాటినట్లు అవుతుంది. ఇదే మహేష్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అయినట్లయితే.. ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ ఇంతకంటే తక్కువ వసూళ్లు సాధించినట్లు భావించాలా? ఇలా పోస్టర్ మీద స్టేట్మెంట్ ఇవ్వడం అంటే.. మహేష్ కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిన రెండు సినిమాల్ని తక్కువ చేసినట్లే. మహేష్‌ను మహేషే అవమానించుకున్నట్లే? కాదంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English