రకుల్ మందు కొట్టే సీన్‌పై రగడ

రకుల్ మందు కొట్టే సీన్‌పై రగడ

దక్షిణాదిన కెరీర్ అయోమయ స్థితిలో ఉండగా.. ఓ బాలీవుడ్ సినిమా మీద భారీ ఆశలతో ఉంది రకుల్ ప్రీత్ సింగ్. సీనియర్ హీరోగా అజయ్ దేవగణ్‌కు జోడీగా ఆమె నటించిన ‘దే దే ప్యార్ దే’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతకుముందు హిందీలో రకుల్ నటించిన రెండు సినిమాలూ డిజాస్టర్లయ్యాయి. ఈసారి కూడా తేడా కొడితే అంతే సంగతులు. అసలే దక్షిణాదిన అవకాశాలు తగ్గిపోయాయి. కెరీర్ ముందుకు సాగేలా కనిపించడం లేదు. ఇలాంటి టైంలో హిందీలో అయినా హిట్ పడితే.. బాలీవుడ్‌లో సెటిల్ అయిపోవచ్చని చూస్తోంది రకుల్. ‘దే దే ప్యార్ దే’ విషయంలో రకుల్ అస్సలు రాజీ పడలేదు. కెరీర్లో ఎన్నడూ లేనంత సెక్సీగా కనిపించిందీ చిత్రంలో. క్లీవేజ్ షోలు, బోల్డ్ యాక్ట్స్‌తో ప్రోమోల్లో పిచ్చెక్కించింది. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో రకుల్ గ్లామర్ కూడా ఒకటనడంలో సందేహం లేదు.

ఐతే సెన్సార్ బోర్డు ఈ సినిమా స్క్రీనింగ్ సందర్భంగా రకుల్ చేసిన ఒక సన్నివేశం మీద అభ్యంతరం చెప్పిందట. ఒక పాటకు లీడ్‌‌గా వచ్చే సన్నివేశంలో రకుల్ మద్యం బాటిల్ తీసుకుని గడగడా తాగేస్తుందట. అలా తాగాక ఊగిపోతూ డ్యాన్స్ చేస్తుందట. ఒక అమ్మాయి ఇలా ఫుల్ బాటిల్ తీసుకుని గడగడా తాగేసినట్లు చూపిస్తే ప్రేక్షకులకు చెడు సందేశం వెళ్తుందన్న ఉద్దేశంతో సెన్సార్ బోర్డు దాన్ని తొలగించాలని స్పష్టం చేసిందట. ఐతే ఆ పాటకు ముందు ఈ సీన్ తీసేస్తే బాగోదంటూ చిత్ర బృందం అభ్యంతరం వ్యక్తం చేసిందట. ఐతే గ్రాఫిక్ ద్వారా అక్కడ మందు బాటిల్‌ను తీసేయమని సూచించడంతో ఆ స్థానంలో పూల గుత్తి ఉన్నట్లుగా ఏదో మేనేజ్ చేసినట్లు చిత్ర వర్గాల సమాచారం. కానీ మందు కొట్టి ఊగిపోతే ఉండే కిక్కు వేరు కానీ.. పూల వాసన చూసి రకుల్ అలా ఊగిపోతే చూడ్డానికి ఎలా ఉంటుందో ఏమో మరి. తెరపై ఈ సీన్ ఎలా ఉంటుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English