ఒకటి నో రిలీజ్.. ఇంకోటి డిజాస్టర్.. మరి మూడోది?

ఒకటి నో రిలీజ్.. ఇంకోటి డిజాస్టర్.. మరి మూడోది?

టాలీవుడ్ కెరీర్ మీద చాలా ఆశలతో ఇక్కడ అడుగుపెట్టింది ముంబయి భామ రుక్సర్ ధిల్లాన్. రాజమౌళి కుటుంబమంతా వెనుక ఉండి తీసిన ‘షో టైమ్’ అనే సినిమాతో ఆమె కథానాయికగా పరిచయం కావాల్సింది. ఐతే ఒక సమయంలో మంచి బజ్ తెచ్చుకున్న ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల రిలీజ్‌కే నోచుకోకుండా ఆగిపోయింది. మధ్యలో ‘ఆకతాయి’ అనే ఊరు పేరు లేని సినిమాలో ఆమె నటించింది. అది వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. కెరీర్ ఇంత పేలవంగా ఆరంభమైనప్పటికీ ఆ తర్వాత ఒక పెద్ద అవకాశం పట్టేసింది రుక్సర్. అదే.. కృష్ణార్జున యుద్ధం. వరుస హిట్లతో ఊపు మీదున్న నాని సరసన హీరోయిన్ అంటే ఇక తన దశ తిరిగినట్లే అనుకుంది రుక్సర్. కానీ ఆ సినిమా అనూహ్యంగా డిజాస్టర్ అయింది. రుక్సర్‌ కెరీర్‌కు పెద్ద బ్రేక్ వేసింది.


అయినప్పటికీ రుక్సర్ ఇంకో ఛాన్స్ అందుకోవడం విశేషమే. రాజమౌళి కుటుంబం, నాని సిఫారసు వల్లో ఏమో.. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘ఏబీసీడీ’లో రుక్సర్‌కు ఛాన్స్ వచ్చింది. తన గత సినిమాలతో పోలిస్తే ఇందులో రుక్సర్‌కు మంచి పాత్రే దక్కినట్లుంది. ఇందులో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. నటనకు కూడా ఆస్కారం ఉన్నట్లే కనిపిస్తోంది. మరి ఈ చిత్రమైనా రుక్సర్‌కు ఆశించిన విజయాన్నందిస్తుందేమో చూడాలి. నటిగా అరంగేట్రం చేసిన ఐదారేళ్ల తర్వాత కూడా సక్సెస్ సాధించకపోతే ఇక మనుగడ సాగించడం కష్టం. ‘ఏబీసీడీ’ ఫలితాన్ని బట్టి రుక్సర్ ఇక సినిమాల్లో కొనసాగాలా.. లేదంటే టాటా చెప్పేయాలా అన్నది డిసైడ్ అయిపోతుందేమో. ప్రస్తుతం హిందీలో రుక్సర్ ‘భాంగ్రా పా లే’ అనే సినిమా చేస్తోంది. ‘యురి’ హీరో విక్కీ కౌశల్ సోదరుడు సన్నీ కౌశల్ ఈ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English