ఫ్లాప్ అయినా దిల్ రాజు ఇప్పుడు చెప్పడు

ఫ్లాప్ అయినా దిల్ రాజు ఇప్పుడు చెప్పడు

‘మహర్షి’ కంటే ముందు దిల్ రాజు ప్రొడక్షన్లో వచ్చిన భారీ చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’ థియేటర్లలో ఉన్నన్ని రోజులు బ్లాక్ బస్టర్‌గా ప్రచారం చేసుకున్నారు. చిరు సినిమా ‘ఖైదీ నంబర్ 150’ వసూళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టినట్లు గొప్పలు పోయారు. ఐతే ఆ చిత్రానికి బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. ప్రేక్షకులు కూడా పెదవి విరిచారు. భారీ స్థాయిలో రిలీజ్ చేయడం వల్ల ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. దాన్ని బట్టి సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ప్రచారం చేసుకున్నారు. చివరికి చూస్తే సినిమా నష్టాలే  మిగిల్చింది. అది ఫ్లాప్ అని తేలింది. కానీ దిల్ రాజు చాలా రోజుల పాటు ఈ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోనే లేదు. వసూళ్ల గురించి గొప్పగానే చెప్పుకున్నాడు.

చివరికి ‘ఫిదా’ సమయంలో ఆయన ఓపెన్ అయ్యారు. తన సినిమాలకు ప్రతిసారీ బయ్యర్లు ఒకరే ఉంటారని.. ‘డీజే’ సినిమా తర్వాత ‘ఫిదా’కు వారితో డబ్బులు తక్కువ కట్టించుకున్నానని.. ఆ సినిమా తర్వాత వాళ్లు మంచి లాభాలు అందుకోవడంతో ‘డీజే’ వల్ల ఏమైనా నష్టాలు వచ్చి ఉన్నా కూడా సెటిల్ అయిపోయాయని అన్నాడు.

నేరుగా ‘డీజే’ ఫ్లాప్ అని చెప్పలేదు కానీ.. ఈ మాట చెప్పడం ద్వారా ఆ విషయాన్ని అంగీకరించినట్లు అయింది. రాజు నుంచి వచ్చిన ‘మహర్షి’ విషయంలోనూ ఇలాగే జరుగుతుందేమో అనిపిస్తోంది. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ భారీ స్థాయిలోనే వచ్చాయి. కానీ చాలా ఏరియాల్లో నష్టాలు తప్పేలా లేవు. యుఎస్, సీడెడ్‌తో పాటు ఆంధ్రాలోని కొన్ని ఏరియాల్లో సినిమా ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయట్లేదు. నైజాం వసూళ్ల విషయంలో కూడా కొంచెం సందేహాలున్నాయి.

ఐతే ఇప్పటికి మాత్రం ‘మహర్షి’ బ్లాక్ బస్టర్ అనే అంటున్నాడు రాజు. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కూడా ఒరిజినల్ రిజల్ట్ ఏంటన్నది చెప్పడేమో. పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాల విషయంలో ఇలా మేనేజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. టాక్, వసూళ్లు కొంచెం అటు ఇటుగా ఉన్నపుడే ఈ కవరింగ్ జరుగుతుంది. కాబట్టి ‘మహర్షి’ జెన్యూన్ రిజల్ట్ ఏంటో దిల్ రాజు మాటల్లో ఇప్పుడు చెప్పడు. ఆయన తర్వాతి సినిమాకు సంబంధించి బిజినెస్ డీల్స్ జరిగినపుడు వాస్తవం వెల్లడవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English