ఆ రెండు చోట్లా ‘మహర్షి’కి భారీ నష్టాలే

ఆ రెండు చోట్లా ‘మహర్షి’కి భారీ నష్టాలే

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘మహర్షి’ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ఆశ్చర్యం కలిగిస్తోంది. కొన్ని ఏరియాల్లో వసూళ్లు భారీగా ఉంటున్నాయి. ఇంకొన్ని చోట్ల తీసికట్టుగా ఉంటున్నాయి. ఒక స్టార్ హీరో సినిమాకు ఇలాంటి వైరుధ్యం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ చిత్రం నైజాం ఏరియాలో భారీ వసూళ్లతో దూసుకెళ్తున్నట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. తొ

లి వారంలో ఏకంగా రూ.20 కోట్లకు పైగా షేర్ వచ్చిందీ ఏరియాలో. ఆంధ్రాలో ఈ స్థాయిలో కాకపోయినా వసూళ్లు బాగున్నాయి. కానీ రాయలసీమలో మాత్రం ‘మహర్షి’ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ తొలి వారంలో ఈ చిత్రం రూ.6.86 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. రూ.12 కోట్లకు పైగా షేర్ రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్‌కు రాని ఈ చిత్రం తొలి వారంలో అందులో సగానికి కాస్త ఎక్కువగా మాత్రమే షేర్ రాబట్టింది.

తొలి వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక తర్వాత ఏమాత్రం షేర్ వస్తుందన్నది సందేహమే. ఫుల్ రన్లో రూ.8 కోట్ల షేర్ మార్కును అందుకుంటే ఎక్కువ అన్నట్లుంది పరిస్థితి. బయ్యర్‌కు మూడో వంతుకు పైగా నష్టాలు తప్పేట్లు లేదు. ఇక అమెరికాలో ‘మహర్షి’ పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. అక్కడ పబ్లిసిటీ ఖర్చులు కలిపితే బ్రేక్ ఈవెన్ రావాలంటే షేర్ రూ.14 కోట్లు రావాలి. అంటే డాలర్లలో ఈ చిత్రం 3.5-4 మిలియన్ల వరకు వసూలు చేయాలి.

కానీ ఇప్పటిదాకా ఈ సినిమా 1.6 మిలియన్ డాలర్లే రాబట్టింది. ఫుల్ రన్లో మహా అయితే 2.5 మిలియన్ మార్కును అందుకోవచ్చేమో. అంటే నష్టాలు భారీగానే ఉండబోతున్నాయి. మహేష్ గత సినిమా ‘భరత్ అనే నేను’ యుఎస్‌లో 3.5 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది. కానీ ‘మహర్షి’ ఆ స్థాయిలో ఊపు చూపించలేదు. ప్రిమియర్ల నుంచే పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఓవర్సీస్ కింగ్  అని మహేష్‌కు ఉన్న ట్యాగ్ ‘మహర్షి’తో పోయేట్లే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English