దేవిశ్రీని తిడితే తమన్ లైక్ కొట్టాడు

దేవిశ్రీని తిడితే తమన్ లైక్ కొట్టాడు

‘అరవింద సమేత’ పాటల విషయంలో తనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచినపుడు తీవ్ర అసహనానికి గురయ్యాాడు తమన్. దేవిశ్రీ ప్రసాద్‌నైతే ఇలాగే ట్రోల్ చేస్తారా అంటూ తన ఆక్రోశాన్ని చూపించాడు. మొత్తానికి దేవి స్థాయికి ఏమాత్రం తగ్గని తనను ట్రోల్ చేస్తూ.. దేవిని మాత్రం ఎవరూ ఏమీ అనకపోవడం తమన్‌ను అసంతృప్తికి గురి చేసినట్లే కనిపించింది ఆ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే. ఐతే ఇప్పుడు తమన్ కోరుకున్నదే జరుగుతోంది. ‘మహర్షి’ ఆడియో విషయంలో దేవి తీవ్ర విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. ఈ సిచువేషన్‌ను తమన్ బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లే ఉంది. ఐతే తన ఆనందాన్ని అతను బయటపెట్టకుండా ఉంటే బాగుండేది కానీ.. ఒక చోట అనుకోకుండా బయటపెట్టేశాడు.

‘మహర్షి’ తర్వాత మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఐతే అనిల్ తన గత సినిమా ‘ఎఫ్-2’కు దేవీతోనే మ్యూజిక్ చేయించుకున్నాడు. అంతకుముందు మూడు సినిమాలకు సాయికార్తీక్ సంగీతం అందించాడు. ఇప్పటిదాకా అనిల్ తమన్‌తో పని చేయలేదు. గత సినిమాకు దేవితో పని చేశాడు కాబట్టి మళ్లీ అతడినే ఎంచుకుంటాడేమో అన్న అభిప్రాయాలున్నాయి.

ఐతే ఓ మహేష్ బాబు అభిమాని మాత్రం దేవి వద్దంటే వద్దు, తమన్‌ను ఎంచుకోమంటూ ఒక ట్వీట్ చేశాడు. ‘దూకుడు’ సినిమాలో మహేష్ ఇంట్రడక్షన్ సీన్‌కు తమన్ అందించిన నేపథ్య సంగీతాన్ని గుర్తు చేస్తూ ఆ వీడియో కూడా షేర్ చేశాడు. ఈ విషయం చెప్పి కిందనేమో.. ‘ఆ డప్పులు దేవిని మాత్రం పెట్టుకోకు’ అని కామెంట్ చేశాడు. ఐతే తమన్ ఈ సంగతి గుర్తించాడో లేదో తెలియదు ఈ ట్వీట్‌కు లైక్ కొట్టేశాడు. తన గురించి పాజిటివ్‌గా పెట్టే ప్రతి ట్వీట్‌నూ రీట్వీట్ చేయడం, లైక్ కొట్టడం తమన్‌కు అలవాటు. కానీ ఈ ట్వీట్లోనే దేవిశ్రీని తిట్టినా లైక్ కొట్టడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. తెలిసో తెలియకో దేవి మీద తనకున్న అక్కసును తమన్ ఇలా వెళ్లగక్కేసినట్లయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English