‘ఒక్కక్షణం’ అలా అవుతుందనుకోలేదు

‘ఒక్కక్షణం’ అలా అవుతుందనుకోలేదు

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన ప్రతి కుర్రాడూ హీరోగా నిలదొక్కుకుంటాడనేమీ లేదనడానికి అల్లు శిరీష్ ఉదాహరణ. అతను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఆరేళ్లవుతోంది. ఇప్పటిదాకా హీరోగా నిలదొక్కుకోలేదు. మధ్యలో ‘శ్రీరస్తు శుభమస్తు’ హిట్టవడంతో శిరీష్ కెరీర్ సెట్టయినట్లే కనిపించింది. అతడి తర్వాతి సినిమా ‘ఒక్క క్షణం’కు మంచి బజ్ కూడా వచ్చింది. కానీ శిరీష్‌ను ఇంకొన్ని మెట్లు ఎక్కిస్తుందనుకున్న ఈ చిత్రం అతడిని పూర్వపు స్థితికి తీసుకొచ్చింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీఐ ఆనంద్ తీసిన ఈ చిత్రం అంచనాల్ని ఏమాత్రం అందుకోలేపోయింది. ఈ సినిమా ఫలితం శిరీష్‌ను బాగానే నిరాశకు గురి చేసినట్లుంది.

తన కొత్త సినిమా ‘ఏబీసీడీ’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసి శిరీష్ ‘ఒక్క క్షణం’ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాడు. ‘ఒక్క క్షణం’ సినిమా ఫలితం విషయంలో నేను చాలా నిరాశకు గురయ్యా. అది కొత్త తరహా కథతో తెరకెక్కిన సినిమా. చాలా నమ్మకంతో ఉన్నాం. చూసిన వారంతా సినిమా బాగుందని అన్నారు. కానీ అది ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాలేదు. సినిమా చేశాం, వదిలేశాం అని కాకుండా అలా ఎందుకు జరిగిందని ఆరా తీశా. చాలా కారణాలు కనిపించాయి. తప్పులు తెలిశాయి. భవిష్యత్తులో వాటిని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నా. ఆ ఆలోచనతో చాలా జాగ్రత్తగా ఎంచుకుని చేసిన సినిమా.. ఏబీసీడీ’’ అని శిరీష్ చెప్పాడు. ‘ఏబీసీడీ’ దర్శకుడు సంజీవ్‌ తనను మొదట ‘సంతాన ప్రాప్తిరస్తు’ అనే కథతో సంప్రదించాడని.. కానీ ఆ కథలో తనను తాను చూసుకోలేకపోయానని.. తర్వాత ‘ఏబీసీడీ’ రీమేక్‌ చేస్తే ఎలా ఉంటుందని తానే సూచించానని.. ఇద్దరం ఓకే అనుకున్నాక ఈ సినిమా చేశామని శిరీష్ తెలిపాడు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English