మళ్లీ కాలర్ లేపిన మహేష్

మళ్లీ కాలర్ లేపిన మహేష్

‘మహర్షి’ సినిమా విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత ఎగ్జైటెడ్‌గా ఉన్నాడో చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు చేయని పనులన్నీ మహేష్ ఇప్పుడు చేస్తున్నాడు. ఎప్పుడూ షేక్ హ్యాండే ఇచ్చే మహేష్.. ఈ సినిమాకు మాత్రం హగ్ ఇచ్చాడని నిర్మాత దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లికి మహేష్ ముద్దు కూడా ఇవ్వడం ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇక ‘మహర్షి’ సక్సెస్ మీట్లో మహేష్ కాలర్ ఎగరేయడమూ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఆ మూమెంట్ అభిమానుల్ని అలరించింది కానీ.. దానిపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు కూడా పడ్డాయి.

ఐతే ఒకసారి కాలర్ ఎగరేయడం మీదే జనాలు అలా స్పందిస్తే.. ఇప్పుడు మహేష్ బాబు రెండోసారి అదే పని చేసిన నేపథ్యంలో ఎలా రియాక్టవుతారో చూడాలి. అవును.. మహేష్ మరోసారి కాలర్ ఎగరేశాడు. ‘మహర్షి’ని రిలీజ్ తర్వాత కూడా అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తున్న మహేష్.. బుధవారం సాయంత్రం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌ను సందర్శించాడు. అభిమానుల మధ్య కూర్చుని సినిమా చూశాడు. మధ్యలో మైకందుకుని అభిమానులతో మాట్లాడుతూ ‘మహర్షి’ సినిమా విషయంలో తాను గర్విస్తున్నానని.. అందుకే మరోసారి కాలర్ ఎగరేస్తున్నానని చెప్పిన మహేష్.. అభిమానుల కేరింతల మధ్య కాలర్ ఎగరేశాడు. ఈ పిక్ ఆల్రెడీ సోషల్ మీడియాలోకి వచ్చేసింది. దీంతో ఇప్పటికే మహేష్‌ను ‘కాలర్ బాబు’ అంటున్న యాంటీ ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోయి మహేష్‌ను, అతడి అభిమానుల్ని ట్రోల్ చేసే పనిలో పడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English