ఈసారి బాబుగారి బండికి పికప్‌ లేదు

ఈసారి బాబుగారి బండికి పికప్‌ లేదు

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రానికి ట్రెయిలర్‌, సాంగ్స్‌తో విపరీతమయిన క్రేజ్‌ తీసుకురాగలిగారు. ఆ క్రేజ్‌తోనే ఆ తర్వాత సినిమా వసూళ్లు అదిరిపోయాయి. ఆ చిత్రం విజయం అటు దర్శకుడి ఘనత కానీ, ఇటు హీరో క్రెడిట్‌ కానీ కాదు. కేవలం ఆ కంటెంట్‌ అప్పుడు అలా సేల్‌ అయింది. అందుకే ఇంకా దర్శకుడు అజయ్‌ భూపతి మలి చిత్రం కోసం హీరోని వెతుక్కుంటూనే వున్నాడు.

ఇక హీరో కార్తికేయ విషయానికి వస్తే 'ఆర్‌ఎక్స్‌ 100' పంథాలోనే అతను 'హిప్పీ' చేసాడు. ఈసారి కూడా చొక్కా విప్పుకుని తిరుగుతూ, మూతి ముద్దులు కురిపిస్తూ యూత్‌ని ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. అయితే ఎల్లవేళలా ఇలాంటి గిమ్మిక్కులకి యూత్‌ ఎట్రాక్ట్‌ అవరు. హిప్పీ టీజర్‌లోనే మేటర్‌ లేదని తేలిపోవడంతో ట్రెయిలర్‌కి సరయిన స్పందన రావడం లేదు.

ఎంత మసాలా దట్టించినా కానీ దీనికి ఆర్‌ఎక్స్‌ 100 మాదిరి పికప్‌ లేదని తేలిపోయింది. తాజాగా ఒక పాట విడుదల చేసినా కానీ దానికి కూడా స్పందన అంతంత మాత్రంగానే వుంది. త్వరలో విడుదలకి సిద్ధమవుతోన్న హిప్పీకి ప్రోమోలతో, పాటలతో క్రేజ్‌ రాని పక్షంలో ఇక ఆర్‌ఎక్స్‌ 100 పేరు మీద ఏమైనా వసూళ్లు వస్తాయని ఆశ పడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English