దిల్‌ రాజు మాయలో మహేష్‌బాబు!

దిల్‌ రాజు మాయలో మహేష్‌బాబు!

మహేష్‌ బాబు సాధారణంగా దర్శకుల పక్షపాతి అనే ఇండస్ట్రీలో అంటూ వుంటారు. నిర్మాతల కంటే దర్శకులకే విలువ ఎక్కువ ఇవ్వడం, వారి మాటే నెగ్గేలా చేయడం మహేష్‌కి అలవాటు. కానీ మహర్షి విషయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి కంటే దిల్‌ రాజు ఎక్కువగా మహేష్‌ని మెప్పించాడట. ఈ చిత్రం విడుదల ప్లానింగ్‌ దగ్గర్నుంచి, బిజినెస్‌ వరకు అన్నిట్లోను దిల్‌ రాజు తన ముద్ర వేసాడు.

న్యాయంగా ఈ చిత్రాన్ని దిల్‌ రాజుకి సోలోగా చేయాల్సి వున్నా కానీ మరో ఇద్దరు నిర్మాతలతో భాగస్వామ్యం తీసుకోవాల్సి రాగా, వారినుంచి తనకి ఎదురయిన ఇబ్బందులని కూడా దిల్‌ రాజు చక్కగా హ్యాండిల్‌ చేసాడట. దీంతో మహేష్‌కి అతని పట్ల మరింత గౌరవం, ఇష్టం పెరిగిపోయి మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. ఇక మహర్షి రిలీజ్‌ ప్లానింగ్‌తో పాటు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌ రేట్లు పెంచుకునే సౌకర్యం కూడా తెచ్చి పెట్టడంతో పాటు ఈ చిత్రానికి తన నంబర్స్‌ తప్ప బయటి నంబర్లు ఏవీ ప్రచారంలోకి రాకుండా చేయడంలో కూడా దిల్‌ రాజు తనదైన చాణక్యం చూపించడంతో మహేష్‌ టోటల్‌గా ఫిదా అయిపోయాడట.

అనిల్‌ రావిపూడితో సినిమాకి కూడా దిల్‌ రాజుని పార్టనర్‌గా వుండాలని పట్టుబడుతున్నాడట. ఇప్పటికే అల్లు అర్జున్‌, ప్రభాస్‌ లాంటి హీరోలతో దిల్‌ రాజుకి సన్నిహిత సంబంధాలున్నాయి. మహర్షితో మహేష్‌ ఇప్పుడు అందరికంటే ఎక్కువ ఆప్తుడైపోయాడని వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English