ఫుల్‌గా క్యాష్‌ చేసుకుంటోన్న వరుణ్‌ తేజ్‌

ఫుల్‌గా క్యాష్‌ చేసుకుంటోన్న వరుణ్‌ తేజ్‌

'వాల్మీకి' చిత్రం ప్రతిపాదన హరీష్‌ శంకర్‌ తీసుకెళ్లినపుడు ఓకే చెప్పకుండా వరుణ్‌ తేజ్‌ చాలా వెయిట్‌ చేయించాడు. ఎఫ్‌ 2తో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన వరుణ్‌ తేజ్‌ ఆ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకునే సినిమా ఇదే అవుతుంది కనుక అందుకు తగ్గ రీతిన ఛార్జ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాడు. అంతకుముందు వరకు తీసుకున్న పారితోషికం కంటే చాలా ఎక్కువ డిమాండ్‌ చేసాడు. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్‌ 2 చిత్రాలతో మినిమమ్‌ గ్యారెంటీ హీరో అనే పేరు రావడంతో వాల్మీకి నిర్మాతలు అతను అడిగినంత ఇవ్వడానికి సరేనన్నారు. ఈ చిత్రానికి వరుణ్‌ అయిదు కోట్లు తీసుకుంటున్నాడనే టాక్‌ వినిపిస్తోంది.

ఇకపై చేసే చిత్రాలకి కూడా ఇదే రేటు లేదా ఇంతకంటే ఎక్కువే అడగాలని వరుణ్‌ డిసైడ్‌ అయ్యాడట. నాని లాంటి హీరోలకి పది కోట్ల పారితోషికం ఇస్తున్నపుడు తనలా మినిమం గ్యారెంటీ రిజల్ట్స్‌ ఇస్తోన్న హీరోలకి ఈమాత్రం ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడరని వరుణ్‌ కనిపెట్టాడు. ఓ స్పోర్ట్స్‌ డ్రామా చేయడానికి అంగీకరించిన వరుణ్‌ ఆ చిత్రానికి కూడా ఇదే పారితోషికం అడుగుతున్నాడట. వరుణ్‌ డేట్లు దొరకడం కష్టం కనుక నిర్మాతలు కూడా అతను అడిగినంత ఇవ్వడానికి ఆలోచించకుండా అంగీకరించేస్తున్నారట. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English