నాగార్జున చెప్పినట్టు ఆడాల్సిందే!

నాగార్జున చెప్పినట్టు ఆడాల్సిందే!

బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి హోస్ట్‌గా నాగార్జున ఖరారయినట్టే. ఇప్పటికే మాట పూర్వకంగా మంతనాలు జరిగిపోయాయి కానీ ఇంకా రాత పూర్వకంగా అగ్రిమెంట్లు కాలేదు. 'మన్మథుడు 2' విదేశీ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని వచ్చాక సంతకాలు అవుతాయి. అయితే ఈ షో విషయంలో నాగార్జున కొన్ని ఖచ్చితమైన నిబంధనలు పెడుతున్నారట. ఇంతకుముందు 'దేవదాస్‌' చేస్తుండగా నాని ఈ షో హోస్ట్‌ చేసాడు కనుక అది ఎంత మెంటల్‌ స్ట్రెస్‌ అనేది నాగార్జున స్వయంగా చూసారట. నాని అనుభవం దృష్ట్యా ఈ షో ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా జరగాలి, ఎలాంటి కంటెస్టెంట్లు వుండాలి వగైరా అంశాలపై నాగార్జున చాలానే ఆంక్షలు పెట్టారట. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్లని ఫైనలైజ్‌ చేయగా, మిగతా వారిని కూడా త్వరలోనే ఖరారు చేయబోతున్నారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో పార్టిసిపేట్‌ చేసిన వారిలో కొందరితో నానికి చనువు ఎక్కువ వుండడం అప్పట్లో వివాదాలకి కారణమయింది. కనుక ఈసారి పార్టిసిపేట్‌ చేసే ఎవరితోను తనకి అంత పర్సనల్‌ ర్యాపో లేదని నాగార్జున ఒకసారి చెక్‌ చేసుకోనున్నారు. టెలివిజన్‌ హోస్ట్‌గా మీలో ఎవరు కోటీశ్వరుడుని సక్సెస్‌ చేసిన నాగార్జున ఈ సీజన్‌కి వచ్చే స్పందన, ఈసారి తనకి వుండే ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి తదుపరి సీజన్‌ చేయాలా వద్దా అని డిసైడ్‌ అవుతారట. ప్రస్తుతానికి అయితే ఒప్పందం ఒక్క సీజన్‌కే చేసుకుంటున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English