తాప్సి వస్తోందంటే మామూలుగా ఉంటుందా?

తాప్సి వస్తోందంటే మామూలుగా ఉంటుందా?

దక్షిణాదిన సినిమాలు చేస్తున్నపుడు తాప్సి స్థాయి ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. సగటు గ్లామర్ హీరోయిన్ లాగే కనిపించిందామె. యాక్టింగ్ పరంగా ఇక్కడ ఆమెకు చెప్పుకోదగ్గ రోల్స్ ఏమీ పడలేదు. గ్లామర్ షోతో మాత్రమే ఆమెకు అంతో ఇంతో పేరొచ్చింది. కానీ బాలీవుడ్‌కి వెళ్లాక ఈ సొట్టబుగ్గల సుందరి రాతే మారిపోయింది. అక్కడ ఆమె పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తో చెలరేగిపోయింది. దీంతో తర్వాత దక్షిణాది వాళ్లు కూడా తాప్సి టాలెంట్ గుర్తించి ఆమె స్థాయికి తగ్గ పాత్రలిస్తున్నారు. ఇప్పటికే తాప్సి ‘ఆనందో బ్రహ్మ’తో మెప్పించింది. ‘నీవెవరో’ ఆడకపోయినా అందులో ఆమె పాత్ర ప్రత్యేకమైందే. ఇప్పుడు ఆమె దక్షిణాదిన ఓ స్పెషల్ మూవీతో పలకరించబోతోంది. అదే.. గేమ్ ఓవర్.

నాలుగేళ్ల కిందట నయనతార ప్రధాన పాత్రలో ‘మయూరి’ అనే సెన్సేషనల్ మూవీతో అరంగేట్రంలోనే అదరగొట్టిన అశ్విన్ శరవణన్ రూపొందించిన చిత్రమిది. ఇంతకుముందు ఆసక్తికర ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆకట్టుకున్న ఇప్పుడు టీజర్‌తో పలకరించింది. ఈ కథ పూర్తిగా తాప్సి చుట్టూ తిరిగేదే. ‘మయూరి’ లాగే ఇది కూడా హార్రర్ మూవీనే. కాకపోతే ఫాంటసీ టచ్ ఉన్న సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్ లాగా కనిపిస్తోంది. ఇందులో తాప్సి గేమింగ్ నిపుణురాలి పాత్ర చేసింది. ఆమె రూపొందించిన ఒక గేమ్ వల్లే సమస్యలు తలెత్తుతాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. టీజర్లో కథ పెద్దగా రివీల్ చేయలేదు కానీ.. విజువల్స్ అయితే భలేగా అనిపిస్తున్నాయి. సినిమా కొత్తగా ఉంటుందనిపిస్తోంది.

హార్రర్ చిత్రాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు థ్రిల్ గ్యారెంటీ అనిపిస్తోంది. ‘గురు’ చిత్రాన్ని నిర్మించిన వైనాట్ స్టూడియోస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ‘బద్లా’ సినిమాతో బాలీవుడ్లో తాప్సి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English