పద్మశ్రీ అవార్డు వెనక్కిచ్చేద్దామనుకున్నాడట

పద్మశ్రీ అవార్డు వెనక్కిచ్చేద్దామనుకున్నాడట

బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనకు దక్కిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేయాలనుకున్నాడట. అలాగని ఈయనేమీ ‘అవార్డ్ వాపసీ’ బ్యాచ్ కాదు. ప్రభుత్వం మీద నిరసనతో అవార్డు వెనక్కి ఇచ్చేయాలనుకోలేదు. తాను ఈ అవార్డుకు అర్హుడిని కానంటూ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు బాధపడి అవార్డు వెనక్కి ఇవ్వాలనుకున్నానని అతను తలెిపాడు. ఐతే తన తండ్రి పటౌడీ చెప్పిన మాటలతో వెనక్కి తగ్గినట్లు సైఫ్ చెప్పాడు. సల్మాన్ ఖాన్ తమ్ముడు నిర్వహించే ఒక టీవీ షోలో.. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్ల మీద సెలబ్రెటీలు స్పందించాల్సి ఉంటుంది.

ఈ కార్యక్రమానికి సైఫ్ రాగా.. అతడి గురించి సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు కొన్నింటిని ప్రస్తావించాడు అర్బాజ్. ‘‘తైమూర్‌ తండ్రి పద్మశ్రీ కొనుక్కున్నారు’’.. ‘‘రెస్టారెంట్‌లో కొంత మందిని కొట్టారు’’.. ‘‘సేక్రేడ్‌ గేమ్స్‌‌లో నటించే అవకాశం ఆయనకు ఎలా ఇచ్చారు? ఆయనకు నటన రాదు’’.. ఇలా ఉన్న కొన్ని కామెంట్లను అర్బాజ్ చదివి వినిపించాడు
దీనిపై సైఫ్ అలీ ఖాన్ స్పందిస్తూ.. పరిశ్రమలో ఎంతో నైపుణ్యం ఉన్న చాలా మంది సీనియర్లు ఉన్నారని.. వారికి దక్కని పద్మశ్రీ తనకు రావడం కాస్త ఇబ్బందిగానే అనిపించిందని.. దీన్ని స్వీకరించాలని తనకు అనిపించలేదని సైఫ్ చెప్పాాడు.

ఐతే నటన, నైపుణ్యంలో తన కంటే తక్కువ స్థాయిలో ఉండి అవార్డు అందుకున్న వారు కూడా ఉన్నారని సైఫ్ అన్నాడు. ఏదేమైనప్పటికీ తనకు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేయాలి అనుకున్నానని.. కానీ ‘నువ్వు భారత ప్రభుత్వం నిర్ణయాన్ని తిరస్కరించే స్థాయిలో లేవు’ అని తన తండ్రి తనతో చెప్పిన మాటతో తాను ఆ ఆలోచనను విరమించుకున్నానని సైఫ్ చెప్పాడు. ఇక తన నటన గురించి వచ్చిన కామెంట్లపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి తాను వేరే వాళ్ల కామెంట్ల గురించి పట్టించుకోకుండా తన నటనను తాను ఆస్వాధిస్తున్నానని... భవిష్యత్తులో మరింత ప్రతిభ కనబర్చడానికి ప్రయత్నిస్తానని.. అప్పుడైనా తాను పద్మశ్రీకి అర్హుడినని జనాలు భావిస్తారేమో చూస్తా అని వ్యాఖ్యానించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English