తాప్సీకి మ్యారేజ్ మెటీరియల్ హీరో దొరికాడు

తాప్సీకి మ్యారేజ్ మెటీరియల్ హీరో దొరికాడు

ఉంగరాల జుట్టు తాప్సీ ఇప్పుడు బోల్డ్ సినిమాలనే చేస్తోంది. కంటెంట్ పరంగా విజువల్ గా బోల్డు సినిమాలు కాదుగాని, అమ్మడు తన మాటల్లో బోల్డునెస్ ఉండే క్యారక్టర్లనే వెతికిపట్టుకుంటోంది. ఆ మధ్యన వచ్చిన మన్మర్జియా సినిమా సేమ్ అలాంటిదే. ఆ సినిమాలు అమ్మడు తన అత్తగారు హనీమూన్ ఎలా ఉందని అడగటానికి ఫోన్ చేస్తే, మీ అబ్బాయి కండోమ్స్ మర్చిపోయి వస్తున్నాడు అంటూ డైలాగులు పేల్చి.. బాలీవుడ్లో బాగా పాపులరైందిలే.

అయితే ఇప్పుడు నేహా ధూపియా నిర్వహించే ఒక టాక్ షోలో మరో హీరో విక్కీ కౌశల్ తో కలసి విచ్చేసిన ఈ ఢిల్లీ బ్యూటి.. మగాళ్లందరూ యాస్ హోల్సే కాని విక్కీ మాత్రం మంచోడు అంటూ కామెంట్ చేసింది. మరి అతడితో డేటింగ్ డీటింగ్ చేయొచ్చుగా అంటే, అతను లవ్ అండ్ డేట్ మెటీరియల్ కాదని, పక్కా మ్యారేజ్ మెటీరియల్ అని వ్యాఖ్యానించింది. పైగా ఇద్దరూ మొదటిసారి కలిసినప్పుడే కనక్ట్ అయిపోయాం అంటూ కామెంట్ చేసింది.

ఇక గతంలో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ అయిన డెన్మార్క్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మ్యాథియాస్ బోయేను డేటింగ్ చేసిన తాప్సీ.. ఇప్పటికీ అతనితో ఉందా లేదంటే బ్రేకప్ అయ్యి విక్కీ కౌశల్ తో తిరుగుతోందా అనే సందేహం మాత్రం చాలామందికి రావడానికి ఈ ఇంటర్యూ దోహదపడింది. మరి నిజంగానే తాప్సీ మ్యారేజ్ మెటీరియల్ ను చేజిక్కించుకుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English