'డాన్' అనేది ఒక టైటిలా అసలు??

'డాన్' అనేది ఒక టైటిలా అసలు??

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కెరియర్లో ఒక గొప్ప హిట్ అంటే 'డాన్' సినిమా గురించి కూడా చెప్పుకుంటారు. ముఖ్యంగా ఆ సినిమాకు సలీం అండ్ జావేద్ అక్తర్ అందించిన కథ హైలైట్. అయితే ఈ సినిమా రిలీజై ఓ నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణంలో.. ఈ సినిమా గురించి ఎవ్వరికీ తెలియని ఒక విషయం తెలియజేశారు బిగ్ బి.

1978లో బచ్చన్ తన సినిమాకు 'డాన్' అని పేరు పెడదామంటే అందరూ వదన్నారట. అదొక టైటిలా అంటూ కామెంట్ చేశారట. ఒక పేపర్ కు ఇచ్చిన ఇంటర్యూలో బిగ్ బి మాట్లాడుతూ.. అసలు అప్పట్లో గాడ్ ఫాదర్ నవల వలన డాన్ అనే పదం పాపులర్ అయ్యిందని తాను అదే పేరును సినిమాకు పెడదమాంటే ఎవ్వరూ ఒప్పుకోలేదని, చివరకు తాను అందరితోనూ వాధించి ఆ టైటిల్ పెట్టించానన్నారు. కాని సినిమా సూపర్ హిట్ అయిపోయాక అందరూ ఆ టైటిల్ చాలా పవర్ఫుల్ అని తెలుసుకున్నట్లు బిగ్ బి చెప్పారు.

అయితే తెలుగులో ఎన్టీఆర్ ను కూడా అందరూ అలాగే అనడంతో, ఆయన తన డాన్ రీమేక్ కు 'యుగంధర్' అనే టైటిల్ పెట్టారు. కాని ఆ సినిమా తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక తమిళంలో రజనీకాంత్ కూడా డాన్ అనే టైటిల్ పెట్టుకోకుండా 'బిల్లా' అనే పేరుతోనే ముందుకెళ్ళారు. ఈ రీమేకులేవీ 'డాన్' సినిమా రేంజులో సక్సెస్ అవ్వలేదంతే. కాని మరోసారి కొత్త యుగంలో షారూఖ్‌, ప్రభాస్ అండ్ అజిత్ మళ్ళీ వాటిని అవే టైటిల్స్ తో రీమేక్ చేశారు. మళ్ళీ హింది డాన్ మాత్రమే ఆడింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English