ఈ మోడలింగ్ అలవాట్లు మాత్రం పోవట్లే

ఈ మోడలింగ్ అలవాట్లు మాత్రం పోవట్లే

చాలామంది ముంబయ్ భామలు.. ముందు మోడలింగులో అడుగుపెడతారు. తరువాత నిధానంగా యాడ్స్ లో నటించి, అక్కడి నుండి సినిమాలవైపు అడుగులేస్తారు. ఒక్కసారి సినిమాల్లో సక్సెస్ అయ్యాక మాత్రం.. అప్పటివరకు రెగ్యులరుగా అటెండ్ అయిన ర్యాంప్ వాకులు చిన్న చిన్న ఫోటో షూట్లు చేయడం మాత్రం మానేస్తారు. ఎప్పుడో ఒకసారి సరదాగా ర్యాంపు మీద తళుక్కుమంటారే కాని, అస్తమానం కనిపించరు.

కాని ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద సినిమాలు తన ఖాతాలో వేసుకుంటున్న డస్కీ సుందరి పూజా హెగ్డే మాత్రం, అసలు తన మోడలింగ్ అలవాట్లను ఏమాత్రం మర్చిపోలేకపోతోంది. అమ్మడు ఒక ప్రక్కన మహర్షి సినిమా ప్రమోషన్లను ముగించుకుని ముంబాయ్ వెళ్ళగానే, వెంటనే అక్కడ ర్యాంప్ వాక్ చేయడం మొదలెట్టేసింది. ఒక ప్రముఖ డిజైనర్ ఫ్యాషన్ షోలో షో స్టాపర్ క్రింద మెరిసింది. అయితే ర్యాంపు వాకులకు ఎంతో పారితోషకం ఇవ్వరు. పైగా బాలీవుడ్లో పూజా పెద్ద స్టారేం కాదు కాబట్టి, అస్సలు ఏమాత్రం క్రేజీ రెమ్యూరేషన్ ముట్టజెప్పే ఛాన్సేలేదు. అయినా ఎందుకు చేస్తున్నట్లబ్బా?

బాలీవుడ్లో ఎప్పుడు స్టార్ అవుతుందో తెలియదు కాబట్టి, అలా స్టార్ అయ్యేవరకు అమ్మడు ఇలాంటి హంసనడకలు నడవాలని డిసైడైంది కాబోలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English