కౌశల్ వేస్ట్ అన్నోళ్లే..కలిసి పార్టీ చేసుకున్నారు

కౌశల్ వేస్ట్ అన్నోళ్లే..కలిసి పార్టీ చేసుకున్నారు

గత ఏడాది వచ్చిన బిగ్ బాస్ సీజన్ 2 కార్యక్రమం గురించి ఇంటర్నెట్లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదులే. ముఖ్యంగా కౌశల్, గీతామాధురి, తనీష్‌ లు చేసిన హడావుడి ఒక రేంజులో ఉండటంతో.. వీళ్లకు నెట్టింట్లో చాలామంది అభిమానులు ఆర్మీలుగా తయారైపోయి, చెత్త ట్వీట్లతో వైరల్ కామెంట్లతో తెలుగోళ్ళకు రోత పుట్టించేశారు. ఇక బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ కు శత్రువులు ఎవరూ అంటే, ఒక్క నూతన్ నాయుడు తప్పించి అందరూ అనే చెప్పాలి.

నిజానికి కౌశల్ తో ఆఖరి వారాల్లో గొడవ పెట్టుకున్న బ్యాచీలో యాంకర్ శ్యామల అలాగే ఆర్.జె గణేష్‌ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏదో విధంగా కౌశల్ ను టచ్ చేసి, ఆ గొడవతో హైప్ తెచ్చుకుందామని చూసినోళ్ళే. అలాగే తొలివారంలోనే ఎలిమినేట్ అయిపోయిన సంజన కూడా కౌశల్ గురించి చాలా చెత్త కామెంట్లు చేసింది. అక్కడ నుండి లెక్కపెడితే గీతామాధురితో సహా అందరూ మనోడ్ని బూతులు తిట్టారు. వేస్ట్ ఫెలో అన్నారు. కప్ గెలిస్తే కంగ్రాట్స్ కూడా చెప్పలేదు.

కట్ చేస్తే నిన్న జరిగిన కౌశల్ బర్తడే సంబరాలకు మాత్రం.. గీతా మాధురి, శ్యామల, అమిత్, గణేష్‌, సంజన, నందిని రాయ్ ఇలా బిగ్ బాస్ బ్యాచ్ అంతా దిగిపోయారు. తనీష్ అండ్ సామ్రాట్ లాంటోళ్ళు కనిపించలేదు కాని, మిగతా గాళ్‌ గ్యాంగ్ అంతా దిగిపోవడం కాస్త క్రేజీగా ఉంది కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English