పటాస్ నుంచి శ్రీముఖి ఔట్

పటాస్ నుంచి శ్రీముఖి ఔట్

తెలుగు టీవీ చరిత్రలో ‘పటాస్’ ఎంతో సక్సెస్‌ఫుల్ షో అని చెప్పవచ్చు. డబుల్ మీనింగ్ డైలాగులతో సాగే కామెడీ ఈ షోను మరింత హైలైట్ చేసింది. ఆ మధ్య జరిగిన వివాదాలూ పటాస్‌కు మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేశాయి. ఈ షోలో యాంకర్ శ్రీముఖి, రవి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అందుకే దీన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖి తన బాడీ లాగ్వేజ్‌తో పాటు గ్లామర్‌తో షోకు మరింత వన్నె తెచ్చింది. ఈ షో ద్వారానే ఆమె ఫేమస్ యాంకర్ అయిపోయింది. ప్రస్తుతం అనసూయ, రష్మీ బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు. వారిద్దరి తర్వాత శ్రీముఖి కూడా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇలాంటి శ్రీముఖి పటాస్ నుంచి తప్పుకుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేసింది.

 ‘‘హాయ్ ఎవ్రీ వన్. ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేయడానికి చిన్న కారణం ఉంది. దానిని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా కెరీర్‌లో అతి ముఖ్యమైన, ఇష్టమైన షో ‘పటాస్’. ఈ షోలో అవకాశం ఇచ్చినందుకు మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ థ్యాంక్స్. ముఖ్యంగా శ్యామ్ గారు, దీప్తి గారు నన్ను నమ్మారు. అవకాశం ఇచ్చారు. పటాస్‌ షోకు షూటింగ్ ఎప్పుడు జరిగినా ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండేది. స్టూడెంట్ రావడం.. సెట్‌లో వాతావరణాన్ని నేనెంతో ఇష్టపడేదాన్ని. కానీ, ప్రొడక్షన్ హౌస్ పర్మీషన్‌తో ఈ షోకు కొంత విరామం తీసుకుంటున్నాను. పటాస్ ఫ్యాన్స్ అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ వీడియో చేశాను’’ అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది. అయితే, ఆమె విరామం తీసుకోవడానికి గల కారణాలేంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English