విశాల్ ఇప్పుడు గెలిస్తే మగాడే..

విశాల్ ఇప్పుడు గెలిస్తే మగాడే..

నాలుగేళ్ల కిందట తమిళ సినీ పరిశ్రమలో నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంగా ఎంత హంగామా నడిచిందో గుర్తుండే ఉంటుంది. శరత్ కుమార్ సహా చాలామంది దిగ్గజాల్ని ఢీకొట్టిన విశాల్.. నడిగర్ సంఘం ఎన్నికల్లో తన ప్యానెల్‌కు అద్భుత విజయాన్నందించాడు. హీరో అయ్యాడు. నడిగర్ సంఘం కార్యదర్శిగా మొదట్లో ఉత్సాహంగా పని చేసిన విశాల్ కొన్ని మంచి పనులతో మంచి పేరు సంపాదించాడు.

ఐతే మంచి పేరు తెచ్చుకోవడానికి సంవత్సరాలు పడితే.. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి కొన్ని రోజులు చాలంటారు. విశాల్ విషయంలోనూ అదే జరిగింది. గత ఏడాదిగా విశాల్ మీద అనేక ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి.

కోలీవుడ్లో అతడిని వ్యతిరేకించే వారి సంఖ్య పెరిగింది. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కూడా బాధ్యత పెంచుకున్న విశాల్.. తన పదవులకు న్యాయం చేయలేకపోయాడన్న విమర్శలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో విశాల్ మళ్లీ నడిగర్ సంఘం ఎన్నికల బరిలో నిలవబోతున్నాడు. అతడి ప్యానెల్ పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. మళ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. శరత్ కుమార్ భార్య రాధిక ఈ ప్యానెల్ మీద పోటీకి దిగబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

విశాల్ మీద ఒకప్పటిలా సానుకూలత లేదని.. అతడికి ఈసారి ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని అంటున్నారు విశ్లేషకులు. ఐతే విశాల్ మాత్రం ధీమాగా ఎన్నికలకు రెడీ అయిపోతున్నాడు. అతను ఎలాంటి స్థితిలో కూడా వెనక్కి తగ్గే రకం కాదు. ఇప్పుడున్న స్థితిలో కూడా ఎన్నికల్లో గెలిచాడంటే విశాల్ మగాడే అని అందరూ అంగీకరిస్తారు. చూద్దాం ఏమవుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English