బాహుబలి ఇమేజ్‌ వేస్ట్‌ చేసుకుంటున్నాడా?

బాహుబలి ఇమేజ్‌ వేస్ట్‌ చేసుకుంటున్నాడా?

బాహుబలి చిత్రంతో రానా దగ్గుబాటికి ఆశించిన దాని కంటే ఎక్కువే పేరొచ్చింది. హీరోగా కూడా నిలదొక్కుకున్నాడు. ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. అయితే ఆ తర్వాత సడన్‌గా రానా కనిపించడం మానేసాడు. ఇతర భాషా చిత్రాల్లో ప్రత్యేక పాత్రల మీద రానా శ్రద్ధ పెడుతున్నాడు. 'హాతీ మేరీ సాతీ' అనే చిత్రం కోసం రానా ఒక ఓల్డ్‌ గెటప్‌ వేస్తున్నాడు. ఈ పాత్ర కోసం తెల్ల జుట్టు, గుబురు గడ్డంతో పాటు పీలగా వున్న లుక్‌ మెయింటైన్‌ చేస్తున్నాడు. ఈ పాత్ర వల్ల అతనికి ఎంత పేరు వస్తుందనేది తెలియదు కానీ దీని కోసం వేసిన గెటప్‌ వల్ల వేరే చిత్రాలు చేయడానికి లేకుండా అయిపోయింది.

వేణు ఉడుగులతో విరాట పర్వం అనే చిత్రాన్ని సాయి పల్లవితో కలిసి చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు కానీ అది మొదలు పెట్టే ముందుగా మిగతా కమిట్‌మెంట్స్‌ పూర్తి చేస్తున్నాడు. బాహుబలితో వచ్చిన ఇమేజ్‌ని బిల్డ్‌ చేసుకోకుండా ఇంకా ఇదివరకటిలా ఇతర భాషల్లో సపోర్టింగ్‌ రోల్స్‌ చేయడంలో రానా ఆంతర్యం ఏమిటో కానీ సురేష్‌ బాబు కూడా బాహుబలి ఇమేజ్‌ని స్టెబులైజ్‌ చేసి స్టార్‌గా సుస్థిరం చేసే సినిమా ఏదీ రానాతో ఇంకా ప్లాన్‌ చేయకపోవడం వింతగానే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English