ఆమె వృద్ధ హీరోలకి మాత్రమే!

ఆమె వృద్ధ హీరోలకి మాత్రమే!

ఆర్‌ఎక్స్‌ 100 లాంటి యూత్‌ఫుల్‌ సినిమాతో పరిచయమయిన పాయల్‌ రాజ్‌పుట్‌కి ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ చిత్రంలో బోల్డ్‌ క్యారెక్టర్‌ చేసినా కానీ యూత్‌ సినిమాలకి ఆమెని ఎవరూ సంప్రదించడం లేదు. కెరియర్‌ అగమ్యగోచరంగా మారిన టైమ్‌లో తనకి 'వెంకీ మామ'లో వెంకటేష్‌ సరసన నటించే ఛాన్స్‌ వచ్చింది. 'మన్మథుడు 2'లో నాగార్జునతోను నటించేదే కానీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ డేట్స్‌ ఇవ్వడంతో ఈమెని పక్కన పెట్టేసారు. ఫిఫ్టీ ప్లస్‌ హీరో రవితేజతో కూడా పాయల్‌ 'డిస్కో రాజా' చేస్తోంది.

తాజాగా బాలకృష్ణతో కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో పాయల్‌ రాజ్‌పుట్‌ కథానాయికగా ఎంపికయింది. ఇందులో మరో హీరోయిన్‌ కూడా వుంటుంది కానీ ఒక హీరోయిన్‌ రోల్‌ అయితే పాయల్‌కి బుక్‌ అయింది. యువ హీరోల చిత్రాలలో మాత్రం పాయల్‌కి ఛాన్స్‌ రావడం లేదు. సీత చిత్రంలో ఐటెమ్‌ గాళ్‌గా మాత్రం కనిపిస్తోంది. యూత్‌ఫుల్‌ సినిమాతో పరిచయమైన యువ హీరోయిన్‌కి వరుసగా వెటరన్‌ హీరోల సినిమాల్లో మాత్రమే అవకాశాలు రావడమేమిటో మరి. ఇవి కూడా వద్దని కూర్చుంటే వచ్చే సంపాదన కూడా చేతులారా పోగొట్టుకున్నట్టు అవుతుందని పాయల్‌ ఈ అవకాశాలని వదలకుండా అంది పుచ్చుకుంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English