బోయపాటికి అంతకంటే హీరో దొరకట్లేదు!

బోయపాటికి అంతకంటే హీరో దొరకట్లేదు!

వినయ విధేయ రామ చిత్రాన్ని అత్యంత దారుణంగా తెరకెక్కించిన బోయపాటి శ్రీను తన ఖాతాలో ఒక ఘోర పరాజయాన్ని వేసుకోవడమే కాకుండా తన ప్రతిష్టని కూడా పాడు చేసుకున్నాడు. ఒక టైమ్‌లో స్టార్‌ హీరోలంతా తనతో ఒక్క సినిమా అయినా చేయాలనే స్థాయికి బోయపాటి రీచ్‌ అయ్యాడు. మాస్‌ సినిమా తీస్తే అతనే తీయాలనే పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు బోయపాటి పేరు చెప్పగానే 'వినయ విధేయ రామ' పీడకలలా వచ్చే పరిస్థితి తలెత్తింది. దీంతో అగ్ర హీరోలెవరూ అతనికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదు.

బాలకృష్ణ సయితం బోయపాటి కోసం వేచి చూసే పరిస్థితి లేదు. మరోవైపు యువ హీరోలకి అతనితో సినిమా చేయాలనే ఆరాటం అసలే లేదు. వరుసగా భారీ బ్లాక్‌బస్టర్స్‌ ఇస్తున్నపుడు అయితే అతనితో వర్క్‌ చేయడానికి సరదా పడే వారేమో. కానీ ఇప్పుడు బోయపాటికి వరుసగా రెండు ఫ్లాప్స్‌ పడడంతో యువ హీరోలు కూడా అతనిపై ఆసక్తిగా లేరు. దీంతో ఆర్‌ఎక్స్‌ 100 హీరో కోసం బోయపాటి ప్రయత్నాలు చేస్తున్నాడట. కార్తికేయ అయితే తనతో పని చేయడానికి ఉత్సాహ పడతాడని భావిస్తున్నాడట. అతనికి సొంత బ్యానర్‌ కూడా వుండడంతో నిర్మాతని వెతుక్కునే పని కూడా వుండదనేది బోయపాటి భావన. కానీ బోయపాటి బడ్జెట్‌ని తట్టుకునేంత స్థాయి కార్తికేయకి  వుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English