సైరాకి రెస్పెక్ట్‌ ఇస్తారా?

సైరాకి రెస్పెక్ట్‌ ఇస్తారా?

సైరా ఇంకా షూటింగ్‌ పూర్తి చేసుకోలేదు. జనవరి నుంచి ఎప్పటికప్పుడు షూటింగ్‌ ముగించాలని చూస్తున్నా కానీ లేట్‌ అవుతూనే వుంది. రీసెంట్‌గా సెట్‌ అగ్నికి ఆహుతి అవడంతో ఇంకొంత ఆలస్యం జరుగుతోంది. అయితే ఎలాగైనా ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేసి తీరాలని చూస్తున్నారు. షూటింగ్‌ ఆలస్యమవుతున్నా కానీ గ్రాఫిక్స్‌ వర్క్‌ వేగంగా పూర్తి చేస్తూ పోస్ట్‌ ప్రొడక్షన్‌కి ఎక్కువ టైమ్‌ తీసుకోకుండా ప్లాన్‌ చేస్తున్నారు. దసరాకి రిలీజ్‌ చేయాలనేది ప్లానే కానీ ఇంతవరకు ఖచ్చితమైన సమాచారం లేదు. దీంతో దసరాకి వేరే చిత్రాలని ప్లాన్‌ చేసుకుంటున్నారు.

మరి సైరా ఆలస్యంగా రేసులోకి వస్తే అప్పుడు దానికి గౌరవం ఇచ్చి మిగతా చిత్రాలని వాయిదా వేస్తారా? బాహుబలి చిత్రం విడుదలయినపుడు మిగిలిన సినిమాలన్నీ వెనక్కి లేదా ముందుకి జరిపి దానికి నాలుగు వారాల స్పేస్‌ ఇచ్చారు. బాహుబలిలానే సైరా కూడా భారీ బడ్జెట్‌ సినిమా. మరి సైరాకి కూడా తెలుగు సినిమా ప్రతిష్ట పేరుతో గౌరవాన్ని ఇస్తారా అనేది ఇప్పుడే చెప్పలేం. ఇటీవల చిన్న సినిమాలని కూడా సీజన్‌లోనే విడుదల చేయడం ఎక్కువయింది కనుక సైరా కోసం ఒక సీజన్‌ మొత్తాన్ని వదిలేసుకోవడానికి టాలీవుడ్‌ సిద్ధపడుతుందా అనేది మరో అనుమానం.  Will

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English