‘భారతీయుడు-2’ను వదిలేసి సీఎం కొడుకుతో?

‘భారతీయుడు-2’ను వదిలేసి సీఎం కొడుకుతో?

తమిళంలో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’. ఆ సంస్థ తెరకెక్కించిన తొలి చిత్రం ‘కత్తి’నే సెన్సేషనల్ హిట్. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో ‘లైకా’ సంస్థ పేరు మార్మోగింది. ఇక ఆ తర్వాత మరింత భారీ చిత్రాలతో దూసుకెళ్లింది లైకా ప్రొడక్షన్స్. శంకర్-రజనీ కాంబినేషన్లో ఏకంగా రూ.545 కోట్ల బడ్జెట్లో ‘2.0’ సినిమాను నిర్మించి రికార్డు నెలకొల్పింది కూడా ఈ సంస్థే. ఓవైపు భారీ చిత్రాలు నిర్మిస్తూనే మీడియం రేంజ్ సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తోందీ సంస్థ. కొన్ని నెలల కిందటే లైకా వాళ్లు శంకర్-కమల్ హాసన్ కలయికలో ‘భారతీయుడు-2’ చిత్రాన్ని మొదలుపెట్టారు. మరో సంస్థ నిర్మించాల్సిన చిత్రాన్ని వీళ్లు టేకప్ చేసి రాజీ లేకుండా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యారు.
 
కానీ ‘2.0’ చేదు అనుభవాన్ని మిగిల్చిన నేపథ్యంలో ‘భారతీయుడు-2’ బడ్జెట్ వీళ్లను కొంత కంగారు పెట్టింది. శంకర్‌తో విభేదాలు వచ్చి ఆ ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగింది. లైకా స్థాయికి ఇలాంటి క్రేజీ మూవీ హోల్డ్ కావడం వారి ప్రతిష్టను దెబ్బ తీసేదే. ఐతే ఈ చిత్రాన్ని పక్కన పెట్టేసి కన్నడలో ఓ సినిమాను టేకప్ చేసింది లైకా సంస్థ. ‘జాగ్వార్’తో హీరోగా పరిచయమై ఇప్పటిదాకా నిలదొక్కుకోని ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా లైకా వాళ్లు సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారట. తన కొడుకు సినిమాకు క్రేజ్ తేవడానికి సీఎం అడిగేసరికి లైకా వాళ్లు ఈ సినిమాను టేకప్ చేశారట. ఐతే ‘భారతీయుడు-2’ లాంటి సినిమాను వదిలేసి లైకా వాళ్లు సీఎం ప్రాపకం కోసం ఇలాంటి సినిమాను టేకప్ చేయడమేంటి అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English