మహేష్ ‘మహర్షి’ని వదిలిపెట్టట్లేదు

మహేష్ ‘మహర్షి’ని వదిలిపెట్టట్లేదు

హీరోగా తన 25వ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నట్లున్నాడు. ‘మహర్షి’ కోసం అతనెంత కష్టపడ్డాడో.. పడుతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. తన కెరీర్లో మరే సినిమాను కూడా మహేష్ ఈ రేంజిలో ప్రమోట్ చేసిందే లేదు. ఒకప్పుడు అసలు సినిమా ప్రమోషన్లకే రాని మహేష్.. కొన్నేళ్లుగా తన సినిమాల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఐతే ‘మహర్షి’ విషయంలో మాత్రం అతను రెట్టింపు కష్టపడుతున్నాడు. రిలీజ్ ముందు ప్రింట్, టీవీ, వెబ్ మీడియాకు ఇబ్బడిముబ్బడిగా ఇంటర్వ్యూలు ఇచ్చిన మహేష్.. రిలీజ్ తర్వాత తన పనైపోయిందని ఊరుకోలేదు.

సక్సెస్ మీట్లో పాల్గొనడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ట్విట్టర్లో మెసేజ్‌లు పెడుతున్నాడు. తాజాగా అతను రైతులుగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లతో ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. బుధవారం అతను హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌ను సందర్శించబోతున్నాడు. నిజానికి ‘మహర్షి’ రిలీజ్ తర్వాత మహేష్ వెకేషన్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ దాన్ని వాయిదా వేసుకుని మరీ ‘మహర్షి’ని ప్రమోట్ చేస్తున్నాడు. వీకెండ్లో అదరగొట్టిన ఈ చిత్రం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ప్రమోషన్ల ద్వారా సినిమాను జనాల చర్చల్లో ఉంచితే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు. ఆరంభ జోరు చూసి ఖుషీ అయిపోయి సైలెంటైతే సినిమా వీక్ డేస్‌లో పడుకుంటుందని, అంతిమంగా నష్టాలు వచ్చి తన సిల్వర్ జూబ్లీ ఫ్లాప్ ముద్ర వేయించుకుంటుందని మహేష్ ఆందోళన చెందినట్లున్నాడు. అందుకే ఈ సినిమాను ఎలాగైనా హిట్ కేటగిరీలో చేర్చాలని తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు మహేస్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English