బెల్లంబాబు అంత సాహసం ఎలా చేశాడో?

బెల్లంబాబు అంత సాహసం ఎలా చేశాడో?

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో ఇప్పటిదాకా హిట్ అన్న మాట లేదు. అయినా అతడి సినిమాలకు ఓపెనింగ్స్ బాగుంటాయి. అందుక్కారణం మొదట్నుంచి మాస్ మసాలా, యాక్షన్ సినిమాలు చేయడమే. అతడి సినిమాల్లో హీరోయిజానికి ఢోకా ఉండదు. ఫైట్లు, డ్యాన్సులతో ఓ వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటాడతను. భారీ తారాగణంతో పెద్ద స్థాయి సినిమాలు చేయడం వల్ల కూడా అతడికి కొంత మార్కెట్ ఏర్పడింది. ‘అల్లుడు శీను’ నుంచి ‘కవచం’ వరకు శ్రీనివాస్ చేసిన ప్రతి సినిమాలోనూ హీరోయిజం ఓ రేంజిలో ఉంటుంది. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ ఇలా ఎంత పెద్ద కథానాయికతో నటించినా కథ మాత్రం తన చుట్టూనే తిరిగేలా చూసుకున్నాడతను. అలాంటివాడు హీరోయిన్ ప్రాధాన్యమున్న ‘సీత’ సినిమాలో నటించడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే.

ఐతే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ శ్రీనివాస్ కాదట. వేరే హీరోల్ని సంప్రదించి.. వాళ్లెవ్వరూ ఓకే చేయని తర్వాత తాను శ్రీనివాస్‌ను అడిగినట్లు దర్శకుడు తేజ వెల్లడించడం విశేషం. ఈ సినిమాలో కథానాయిక పాత్రకే ప్రాధాన్యం  ఎక్కువ అని, కథ ప్రధానంగా కాజల్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందని.. ఈ కారణంతోనే తాను అడిగిన హీరోలందరూ ఈ సినిమా చేయడానికి విముఖత చూపారని తేజ చెప్పాడు. చివరగా శ్రీనివాస్‌ను అడిగితే.. అతను మాత్రం ఏమీ ఆలోచించకుండా ఈ సినిమా చేసినట్లు తేజ చెప్పాడు. ఐతే ఎప్పుడూ హీరోయిజం హీరోయిజం అని వెంపర్లాడే శ్రీనివాస్ వేరే హీరోలునో అన్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు ఓకే చెప్పడం విశేషమే. ఇప్పటికా హిట్ రుచి చూడక పోవడం, నటుడిగా ఏమీ  పేరు రాకపోవడంతో ‘సీత’ ద్వారా ఆ రెండు లోటులూ పూడ్చుకుందామని అనుున్నాడేమో. మరి ఈ నెల 24న రాబోతున్న ఈ చిత్రం అతడి ఆశను నెరవేరుస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English