షాకింగ్.. వి.వి.వినాయక్ హీరో అట

షాకింగ్.. వి.వి.వినాయక్ హీరో అట

దర్శకుడిగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాడు వి.వి.వినాయక్. టాలీవుడ్లో చాలామంది స్టార్లు, సూపర్ స్టార్లతో సినిమా చేసిన వినాయక్.. ప్రస్తుతం దయనీయమైన స్థితిలో ఉన్నాడు. గత ఏడాది ‘ఇంటిలిజెంట్’ సినిమా డిజాస్టర్ కావడంతో వినాయక్ కెరీర్ గాడి తప్పింది. ఇప్పటిదాకా తన తర్వాతి సినిమాను ప్రకటించలేకపోయాడాయన. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఏ సినిమా కూడా వర్కవుట్ కావడం లేదు. ఇలాంటి తరుణంలో వినాయక్ గురించి ఒక షాకింగ్ రూమర్ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఆయన కథానాయకుడిగా మారబోతున్నారట.

వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌ మీద ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన నరసింహారావు ఇంతకుముందు ‘శరభ’ అనే సినిమాను రూపొందించాడు. మరో రెండు నెలల్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని కూడా అంటున్నారు. వినాయక్ అవతారం, ఆహార్యం చూసి ఆయన హీరో ఏంటి అనిపించొచ్చు. ఐతే ఈ సినిమా ఆయన లుక్‌కు తగ్గట్లే ఉంటుందట. ఒక నడి వయసు వ్యక్తి కథ ఇదని.. చాలా వైవిధ్యంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు.

వినాయక్‌కు నటుడిగా అనుభవం లేకేమీ లేదు. తన దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఠాగూర్’లో ఒక చిన్న పాత్ర చేసి మెప్పించాడు వినాయక్. ఆయనలో మంచి నటుడున్నాడని తనతో సినిమాలు చేసిన వాళ్లు అంటుంటారు. ‘ఇంటిలిజెంట్’ తర్వాత బాలయ్య, వెంకటేష్, రవితేజ.. ఇలా చాలామంది హీరోల్ని ట్రై చేసి ఫెయిలయ్యాడు వినాయక్. ఎవరితోనూ సినిమాలు సెట్ కాలేదు. చివరగా రవితేజతో వినాయక్ సినిమా అంటూ ప్రచారం జరిగింది. దానిపై క్లారిటీ రాకముందే వినాయక్ హీరోగా సినిమా అంటూ ఆశ్చర్యకర వార్త హల్ చల్ చేస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English