సమంత సినిమా ఆయన చేతిలో!

సమంత సినిమా ఆయన చేతిలో!

చిన్న సినిమాలకి ఇప్పుడు సురేష్‌బాబు గేట్‌వేగా మారారు. లో బడ్జెట్‌ చిత్రాలకి సురేష్‌బాబు అయితే మంచి రిలీజ్‌ ప్లాన్‌ చేయగలడు. అలాగే కాస్త లాభాలు కూడా చూపించగలడు. ఆయన పేరు మీద లాభ పడ్డ సినిమాలు చాలానే వున్నాయి. అందుకే సమంత లాంటి పాపులర్‌ నటి వున్నా కానీ 'ఓ బేబీ' అనే కాన్సెప్ట్‌ సినిమాని సురేష్‌ బాబు చేతిలో పెట్టారు. అయితే సురేష్‌ చేతిలోకి వెళ్లిన తర్వాత ఏ సినిమాకి అయినా అన్నీ ఆయనే అవుతారు. సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవ్వాలి, ఎప్పట్నుంచి పబ్లిసిటీ స్టార్ట్‌ చేసుకోవాలి లాంటివన్నీ ఆయనే చెబుతారు. అంతా బానే వుంటుంది కానీ సురేష్‌ చేతిలో ఎప్పుడూ అరడజను సినిమాల వరకు వుంటాయి. వాటన్నిటికీ తగిన విడుదల తేదీలు దొరకడం కష్టం. పెద్ద సినిమాలతో క్లాష్‌ రాకుండా జాగ్రత్తగా రిలీజ్‌ ప్లాన్‌ చేస్తుంటారు కనుక ఏ సినిమా అయినా కానీ రోజుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఓ బేబీ కంటే ముందు రిలీజ్‌కి సిద్ధంగా వున్న సినిమాలు ఆయన చేతిలో చాలానే వున్నాయి కనుక అవన్నీ అయితే కానీ సమంతకి క్లియరెన్స్‌ లభించకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English