మహేష్ ముద్దుపై ఎస్.జె.సూర్య కామెంట్

మహేష్ ముద్దుపై ఎస్.జె.సూర్య కామెంట్

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ ముగింపు దశలో తనకు ఒక హగ్ ఇవ్వడం గురించే దిల్ రాజు స్థాయి నిర్మాత గొప్పగా చెప్పుకున్నాడు. మహేష్ మామూలుగా షేక్ హ్యాండ్‌తో సరిపెడతాడని.. కానీ ఈ సినిమా పూర్తయ్యాక తనకు హగ్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడని అన్నాడు రాజు. ఐతే మహేష్ ‘మహర్షి’ రిలీజ్ తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లికి ఏకంగా ముద్దే ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోను వంశీ ట్విట్టర్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ ఇలా ఒక దర్శకుడికి ముద్దివ్వడం అన్నది గతంలో ఎప్పుడూ జరగలేదు. అతను అంతగా ఎగ్జైట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మహేష్‌తో దర్శకుడిగా ‘నాని’ సినిమా చేయడంతో పాటు ‘స్పైడర్’లో అతడితో కలిసి నటించిన డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ ఎస్.జె.సూర్య సైతం ఈ ముద్దు విషయంలో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆసక్తికర కామెంట్ చేశాడు.

కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫొటో చూశానని.. అందులో మహేష్ ‘మహర్షి’ దర్శకుడికి ముద్దిస్తున్నాడని.. మహేష్ ముద్దు ఎంత నిజాయితీగా ఉంటుందో తనకు వ్యక్తిగతంగా తెలుసని అన్నాడు సూర్య. తర్వాత తాను ‘మహర్షి’ సినిమా చూశానని.. ఈ ముద్దు ఆ సినిమా పట్ల తన ప్రేమను, గౌరవాన్ని చాటడానికే ఇచ్చాడని అర్థమైందని చెప్పాడు సూర్య. మహేష్, వంశీ పైడిపల్లి కలిసి ‘మహర్షి’ ద్వారా అందరికీ చక్కటి ఫీల్ కలిగిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాడు సూర్య. మొత్తానికి సూర్య పనిగట్టుకుని ‘మహర్షి’ సినిమా చూసినట్లున్నాడు. అతడికా చిత్రం బాగా నచ్చినట్లుంది. ఓ తమిళ దర్శకుడు, నటుడు ఇలా ‘మహర్షి’ గురించి వ్యాఖ్యానించడం విశేషం. ‘స్పైడర్’తో తమిళ ప్రేక్షకులకు మహేష్ నేరుగా పరిచయం అయిన నేపథ్యంలో ‘మహర్షి’ సినిమాను అక్కడి జనాలు బాగానే చూస్తున్నారు. తమిళ వెబ్ సైట్లు ఈ చిత్రానికి రివ్యూలు కూడా ఇవ్వడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English