‘అర్జున్ రెడ్డిని’ చూసి సిగ్గు పడాలంటున్న దేవరకొండ

‘అర్జున్ రెడ్డిని’ చూసి సిగ్గు పడాలంటున్న దేవరకొండ

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ ఎంత గొప్ప పేరు సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక కొత్త నటుడు అలాంటి పెర్ఫామెన్స్ ఇవ్వడం అన్నది షాకింగే. తెలుగు సినీ చరిత్రలోనే అంత తక్కువ అనుభవంతో అలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చిన నటుడు మరొకరు కనిపించరు అంటే అతిశయోక్తి కాదు. ‘అర్జున్ రెడ్డి’ని తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా రీమేక్ చేస్తే.. విజయ్ ముందు అతను తేలిపోయాడు. హిందీలో షాహిద్ కపూర్ లాంటి పెర్ఫామర్ ఈ పాత్రను చేసినప్పటికీ విజయ్‌ను మ్యాచ్ చేయలేకపోయాడు. షాహిద్ బాగానే చేసినా కూడా విజయ్‌తో పోలిస్తే కిందనే ఉంటాడనిపిస్తుంది. అర్జున్ రెడ్డి పాత్రలో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన విజయ్.. ఆ సినిమాను చూసి కొన్నేళ్ల తర్వాత తాను సిగ్గుపడాలని అంటున్నాడు. ఆ స్థాయిలో నటుడిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నట్లు అతను ఆసక్తికర వ్యాఖ్య చేశాడు.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘మీరు ప్రతి సినిమాకు నటనను మెరుగు చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఈ విషయంలో మీకు వ్యక్తిగత లక్ష్యాలు ఉన్నాయా’ అని ప్రశ్నించగా.. ‘‘అర్జున్‌ రెడ్డి సినిమాను చూసి నేను సిగ్గుపడే స్థాయికి చేరుకోవాలని అనుకుంటున్నా. ఇంకొన్ని ఏళ్లు గడిచిన తర్వాత కూడా ‘అర్జున్‌ రెడ్డి’ నా ఉత్తమ చిత్రం అని చెప్పుకుంటే దానర్థం నేను ఎదగడం లేదని. ఈ వృత్తిలో నిరంతరం కొత్త విషయాల్ని నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి సినిమాకు ది బెస్ట్‌గా అవ్వాలనేది నా ఉద్దేశం. నేను చూసి ఎంజాయ్‌ చేసేలా ఉండే చిత్రాల్ని చేయాలని ఉంది’ అని విజయ్ చెప్పాడు.

విజయ్ తన ప్రతి సినిమాతో మెప్పించినా కూడా ‘అర్జున్ రెడ్డి’ని మించిన పెర్ఫామెన్స్ ఇవ్వడమంటే మాత్రం మామూలు విషయం కాదు. ఇక తన కొత్త సినిమా  ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా గురించి విజయ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా విషయంలో నేను చాలా ఉత్సాహంతో ఉన్నాను. ఇందులో విద్యార్థి పాత్రను పోషించా. కొత్త దర్శకుడు భరత్‌ కమ్మ తీసిన న్యూఏజ్‌ లవ్‌ స్టోరీ ఇది. వెండితెరపై ఈ కథ చూడటానికి అద్భుతంగా ఉంటుంది. నా అభిమానులు చాలా రోజులుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తగ్గట్టు ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English