మహేష్‌ యునిఫాం పక్కన పడేశాడట

మహేష్‌ యునిఫాం పక్కన పడేశాడట

ఆగడు సినిమాకు మధ్యలోనుండి సైడ్ అయిపోయిన రైటర్ అనిల్ రావిపూడి. అబ్బే.. శ్రీనువైట్లతో గొడవొచ్చి కాదులే, మనోడికి పటాస్ ఆఫర్ రావడం వలన పక్కకొచ్చాడంతే. అయితే తాను ఆ సినిమాకు ఫుల్ లెంగ్త్ పని చేసుంటే సీన్ వేరేలా ఉండేదని పలుమార్లు అనిల్ కామెంట్ చేశాడు. అందుకే ఇప్పుడు మహేష్‌ తో మనోడు చేయబోయే సినిమాలో మరోసారి కాప్ వేషం వేస్తున్న సూపర్ స్టార్ అంటూ రూమర్లు పుట్టుకొచ్చాయ్.

అయితే ఈ విషయంలో అనిల్ రావిపూడి ఒక పక్కా నిర్ణయానికి వచ్చాడట. అసలు మహేష్‌ బాబుతో సినిమా అంటూ చేస్తే ఖచ్చితంగా ఆ సినిమాలో సూపర్ స్టార్ ను పోలీస్ వేషంలో మాత్రం చూపించకూడదు అనుకున్నాడట. అందుకే ఇప్పుడు తను అనుకున్న కథలో మహేష్‌ వేసుకోవాల్సిన యనిఫాం తీసి పక్కనపడేసి దానిని కొత్త తరహాలో తీర్చిదిద్దాడని టాక్ వినిపిస్తోంది. నిజానికి అనిల్ తీసిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ ప్యాట్రన్ ఒకేలా ఉంటుంది. కాని ఎఫ్‌ 2 లో అది మార్చడంతో మనోడు బ్లాక్ బస్టర్ చవిచూశాడు. మరి మహేష్‌తో కూడా అలా ఏదన్నా మ్యాజిక్ చేస్తేనే బాగుంటుందని ఫీలై, కొత్త ప్రయత్నం ఒకటి చేస్తున్నాడట.

ఏదేమైనా కూడా మహర్షి సినిమాతో మరోసారి సీరియస్ కంటెంట్ తోనే వచ్చి సగం ఆకలిని మాత్రమే తీర్చిన మహేష్‌.. అనిల్ రావిపూడి సినిమాతో తమకు ఫుల్ మీల్స్ పెడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సో ఖాకీ చొక్కా వేసినా వేయకపోయినా కూడా, కామెడీ చుక్కలు మాత్రం ఎక్కువగానే వేయాలి. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English