మెగా న్యూస్.. మరకలు పడిపోయాయ్

మెగా న్యూస్.. మరకలు పడిపోయాయ్

చారిటీ సంస్థ పెడితేనే.. బ్లడ్ బ్యాంకు ముసుగులో రక్తం అమ్మేసుకుంటున్నారు అంటూ మెగాస్టార్ చిరంజీవిపై అప్పట్లో నిందలు వేశారు. ఇప్పుడంటే పాలిటిక్స్ లో లేరు కాబట్టి బ్రతికిపోయారు కాని, లేకపోతే కొందరు కొలీగ్స్ ఆయనపై చల్లడానికి ఎప్పుడూ బక్కెట్ బురద రెడీగానే పెట్టుకుంటారు. కాని ఇప్పుడు ఊహించని విధంగా ఒక మెగా మరక వచ్చిపడింది.

అవతల నిజంగానే చాలామంది సీట్లిచ్చి చదివిస్తున్న మోహన్ బాబునే, ఫీజ్ రీయింబర్సమెంట్ నిధులు వాడుకుని లాభాలు పొందుతున్నావ్ అని తిడుతుంటే.. సరిగ్గా అదే తరుణంలో శ్రీకాకుళంలో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ ఒక వార్త దుమారాన్నే లేపింది. ఎవరో అభిమాని ఒక స్కూల్ పెట్టేసి, ఆ స్కూల్లో చిరంజీవికి, ఆయన తనయుడు చరణ్‌కు, బ్రదర్ నాగబాబుకు గౌరవ పదవులు ఇచ్చేయడంతో.. ఒక వర్గం మీడియా ఇప్పుడు చిరంజీవి డబ్బులు సంపాదించడానికి మరో ప్లాన్ వేశారని ప్రచారం స్టార్ట్ చేసేశారు.

ఒక ప్రక్కన సైరా సినిమా పూర్తిచేయడానికి మెగాస్టారుకూ, అలాగే ఆర్ఆర్ఆర్ పూర్తి చేయడానికి చరణుకూ టైమ్ సరిపోవట్లేదు బాబోయ్ అంటూ మెగాభిమానులు మొత్తుకున్నా కూడా, అబ్బే మెగా ఫ్యామిలీ విద్యపేరుతో డబ్బులు దండుకోనుంది అంటూ వదంతులు పుంతలు తొక్కేశాయ్. న్యూస్ లో నిజం ఉన్నా లేకపోయినా కూడా, మెగా మరకలు అంటుకోక తప్పలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English