తమ్ముడి సినిమాను ప్రమోట్ చేయొచ్చుగా?

తమ్ముడి సినిమాను ప్రమోట్ చేయొచ్చుగా?

చాలారోజుల తరువాత తన లక్కును పరీక్షించుకోవడానికి ఒక సినిమాతో వస్తున్నాడు అల్లు శిరీష్‌. మలయాళంలో హిట్టయిన ఎబిసిడి అనే సినిమాను అదే పేరుతో ఇప్పుడు తెలుగులోకి తెస్తున్నాడు. ఈ నెల 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఇప్పుడు బజ్ బాగా తక్కువగా ఉంది. ఈ తరుణంలో అందరూ స్విట్జర్లాండ్ నుండి ఫోటోలు పెడుతున్న అల్లు అర్జున్ తన తమ్ముడి సినిమాను ఎందుకు ప్రమోట్ చేయడు అని అడగటంలో తప్పులేదేమో.

నిజానికి ఒక సినిమాకు భారీ రేంజులో హైప్ ఉంటేనే భారీ కలక్షన్లు వస్తాయి. కాని హైప్ లేకపోతే మాత్రం సినిమా బాగున్నా కూడా.. సినిమా బాగుందని జనాలు తెలుసుకుని ధియేటర్లకు వచ్చేసరికి అక్కడ ధియేటర్లలో వేరే సినిమా పడిపోయే ఛాన్సుంది. ఈ టైములో ఎబిసిడి సినిమాకు బాగా బజ్ తేవాలంటే అల్లు అర్జున్ వంటి సీనియర్ ప్రమోట్ చేస్తే బాగుంటుంది. మరి ప్రతీ సినిమాకూ తమ్ముడ్ని ఏం ప్రమోట్ చేస్తాంలే అనుకున్నాడో లేదంటే తను షెడ్యూల్ ప్రకారం తన ఫారిన్ ట్రిప్ వెళ్ళిపోతే శిరీష్‌ చెప్పాపెట్టకుండా ఈ డేటుకు సినిమాను తెస్తున్నాడో తెలియదు కాని.. ఎబిసిడి మాత్రం చాలా మినిమం బజ్ తో రిలీజవ్వబోతోంది.

కనీసం ట్రైలర్ బాగుందనో.. తమ్మడు ఇరగదీశాడనో ఓ రెండు ట్వీట్లు నాలుగు ఇనస్టాగ్రామ్ పోస్టులు అయినా పెడితే.. అల్లు అర్జున్ ఇప్పుడు శిరీష్‌కు మంచి సాయం చేసినోడు అవుతాడు. చూద్దాం ఏం చేస్తాడో!!

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English