కాజల్‌ డామినేషన్‌కి సై అన్న బెల్లంకొండ

కాజల్‌ డామినేషన్‌కి సై అన్న బెల్లంకొండ

'సీత' చిత్రంలో స్వాతిముత్యం లాంటి పాత్రకి బెల్లంకొండ సురేష్‌ని తీసుకోవడం ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నటనకి చాలా స్కోప్‌ వున్న ఆ పాత్రలో మాస్‌ ఇమేజ్‌ వున్న బెల్లంకొండ కాకుండా నటన బాగా వచ్చిన వాళ్లయితే బాగుండేది కదా అనేది చాలా మంది అభిప్రాయం. అయితే తేజ కూడా ఈ పాత్రకి బెల్లంకొండ శ్రీనివాస్‌ని అనుకోలేదట. చాలా మంది హీరోలని కలిసి కథ చెప్పాడట. అయితే అందరూ హీరోయిన్‌ది డామినేటింగ్‌ రోల్‌ అని భయపడి చేయమని తప్పుకున్నారట. చివరకు బెల్లంకొండ శ్రీనివాస్‌ ఒప్పుకున్నాడట. అతనికి ఓపెనింగ్స్‌ తెచ్చే సత్తా వుంది కనుక మంచి ఆప్షనే అని తేజ అతడినే ఓకే చేసాడట.

'అఆ'లో సమంతకి ఎక్కువ పాత్ర వున్నా కానీ నితిన్‌ ఆ సినిమా చేసి బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. సీత కూడా అలాగే శ్రీనివాస్‌కి కలిసి వస్తుందేమో ఎవరికి తెలుసు? ఇకపోతే ఈ చిత్రం కాంట్రాక్ట్‌ లవ్‌ అనే కాన్సెప్ట్‌తో రూపొందిందట. హీరోయిన్‌కి ప్రేమికుడిగా హీరో నటించడమనేది కొత్త కాన్సెప్టేమీ కాదు. కాకపోతే దానికి రామాయణం ట్రీట్‌మెంట్‌ ఇచ్చి తేజ ఏదో మ్యాజిక్‌ చేసానని చెబుతున్నాడు. ట్రెయిలర్‌ అయితే జనాల దృష్టిని ఆకర్షించగలిగింది. ఇక ఎలా ఆడుతుందనేది సినిమాలో కంటెంట్‌ని బట్టి వుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English