బూతులతో బాగా కనక్ట్‌ అయిండు

బూతులతో బాగా కనక్ట్‌ అయిండు

యూత్‌ని ఆకట్టుకోగలిగితే కనుక ఆ చిత్రానికి ఓపెనింగ్స్‌ పరంగా ఢోకా వుండదు. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు తీసే వారు యువత దృష్టిలో పడితే పాస్‌ అయిపోతున్నారు. అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత ఆ స్థాయిలో యూత్‌ని ఆకట్టుకుంటున్నాడు ఫలక్‌నుమా దాస్‌. విశ్వక్‌ సేన్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ చిత్రం మలయాళంలో వచ్చిన అంగమలి డైరీస్‌కి రీమేక్‌. గ్యాంగ్‌ వార్స్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని వీలయినంత 'సహజంగా' తీసారు.

సినిమా భాష కాకుండా జనాల వాడుక భాషలోనే ఇందులోని క్యారెక్టర్లు మాట్లాడుకుంటాయి. ఈ క్రమంలో పచ్చి బూతులని కూడా ఎలాంటి భీతి లేకుండా మాట్లాడేసారు. ఇదే యువతని పిచ్చ పిచ్చగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని అత్యంత క్రేజీగా మార్చేసింది. టీజర్‌ తర్వాత ట్రెయిలర్‌కి వస్తోన్న స్పందన బట్టి ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్‌ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రెయిలర్‌ చూస్తుంటే యూత్‌కి కావాల్సిన అంశాలు అన్నిటినీ మిళితం చేసారనేది అర్థమవుతోంది. ఈ చిత్రానికి సురేష్‌బాబు సపోర్ట్‌ కూడా వుంది కనుక విడుదల పరంగా ఎలాంటి ఢోకా వుండదనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English