మహేష్‌ సరండర్‌ అవ్వట్లేదు

మహేష్‌ సరండర్‌ అవ్వట్లేదు

మహర్షి చిత్రానికి టాక్‌ ఏమి వచ్చినా కానీ వసూళ్లని చూపించి కాలరెగరేయాలని టీమ్‌ డిసైడ్‌ అయిపోయింది. అందుకే నాలుగు రోజులు తిరగకుండా రెండు సక్సెస్‌ మీట్లు పెట్టుకుంది. హాలిడేకి వెళదామని అనుకున్న మహేష్‌ అవసరమయితే అది కాన్సిల్‌ చేసుకుని థియేటర్లకి టూర్‌ వెళ్లి ప్రచారం చేస్తానని అంటున్నాడట. మహేష్‌ ఇంతగా ఎందుకు మహర్షి విషయంలో పరితపిస్తున్నట్టు? పరాజయం అని పది మంది అనగానే సరండర్‌ అయిపోతే దానినుంచి బయట పడడం కష్టమని మహేష్‌ రియలైజ్‌ అయ్యాడు.

స్పైడర్‌ చిత్రానికి నెగెటివ్‌ టాక్‌ వచ్చినపుడు మహేష్‌ ప్లానింగ్‌లో చాలా మార్పు చేర్పులు చేసుకున్నాడు. పీఆర్‌ టీమ్‌ని అపాయింట్‌ చేసుకుని తన సినిమాకి నెగెటివ్‌ టాక్‌ రాకుండా చూసుకున్నాడు. భరత్‌ అనే నేను యావరేజ్‌గానే ఆడినా కానీ బ్లాక్‌బస్టర్‌ లెవల్‌కి దానిని ప్రొజెక్ట్‌ చేసుకున్నారు. మహర్షి చిత్రానికి కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. తారక్‌, చరణ్‌, ప్రభాస్‌ భారీ సినిమాలతో తలమునకలయి వుండడంతో ఎక్కువ సినిమాలు చేయడానికి, తద్వారా నంబర్‌వన్‌ పొజిషన్‌లో నిలిచిపోవడానికి మహేష్‌కి చాలా మంచి తరుణమిది. దీనిని ఏ కారణం చేత వృధా చేసుకోకుండా మహేష్‌ తనవంతుగా సినిమాని నిలబెట్టడానికి ఎంత చేయవచ్చో అంతా చేస్తున్నాడు. ఎలాంటి చర్యలకి పాల్పడితే, ఎలాంటి మాటలు మాట్లాడితే తన సినిమాని తక్కువ చేయరో అలాంటివి పట్టు బట్టి మరీ చేస్తూ షాకిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English