సీమలో మహేష్ కష్టాలు

 సీమలో మహేష్ కష్టాలు

dచెబుతున్నారు. ఐతే అన్ని ఏరియాల్లో భారీ వసూళ్లే వచ్చాయి కానీ.. రాయలసీమలో మాత్రం ‘మహర్షి’ అంచనాలకు తగ్గట్లుగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

నైజాంలో రూ.16.6 కోట్ల షేర్ కొల్లగొట్టిన ఈ చిత్రం.. నాలుగు జిల్లాలున్న సీడెడ్ ఏరియాలో రూ.5.6 కోట్ల షేర్‌తో సరిపెట్టుకుంది. మూడు జిల్లాల వైజాగ్ ఏరియాలో కూడా రూ.6.05 కోట్ల షేర్ రాబట్టి రాయలసీమలో రూ.5.6 కోట్లకు పరిమితం కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఈ సినిమాకు సీమలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతంతమాత్రంగా నడిచాయి. బెనిఫిట్ షోలు కూడా తక్కువ పడ్డాయి. వాటికీ స్పందన తక్కువే. మిగతా చోట్ల మహేష్ అభిమానులు వెర్రెత్తిపోతూ బెనిఫిట్ షోలకు హోరెత్తించారు. కానీ రాయలసీమలో తెల్లవారుజామున షోలు నిండటం కష్టమైంది. మిగతా ఏరియాలతో పోలిస్తే రాయలసీమలో మహేష్ ఫాలోయింగ్ తక్కువే. ఇక్కడ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పోలిస్తే మహేష్ వెనుకే ఉంటాడు.

అతడి గత సినిమా ‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కూడా ఫుల్ రన్లో రూ.10 కోట్ల షేర్ రాబట్టలేకపోయింది. అయినా ‘మహర్షి’ని రూ.12.6 కోట్లకు అమ్మారు. ప్రస్తుత కలెక్షన్లు చూస్తే ఈ చిత్రం రూ.10 కోట్ల షేర్ మార్కును టచ్ చేయడం కూడా కష్టమే అనిపిస్తోంది. బయ్యర్‌కు పెద్ద మొత్తంలోనే నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English